అంగన్‌వాడీ పాఠశాలలో క్రిస్మస్‌ వేడుకలు

0
260
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 22 : లోక రక్షణ నిమిత్తమై ఏసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారని, ఆయన మార్గం అనుసరణీయమని కార్పొరేటర్‌ రెడ్డి పార్వతి అన్నారు. స్థానిక 34వ డివిజన్‌లో ఉన్న ఆర్యాపురం 1, 2 అంగన్‌వాడీ సెంటర్‌లో ఈరోజు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా కార్పొరేటర్‌ రెడ్డి పార్వతి, ఐసిడిఎస్‌ సిడిపిఓ సిహెచ్‌.లక్ష్మి, సూపర్‌వైజర్‌ దుర్గామణి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు శాంతా క్లాజ్‌ టోపీలు, తెల్లని దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాటలు పాడి డాన్సులు వేశారు. చిన్నారుల మధ్య రెడ్డి పార్వతి కేక్‌ కట్‌ చేసి వారికి తినిపించారు. అనంతరం చిన్నారులకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు చింతలదేవి, టి.విజయ, హెల్పర్లు శాంతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here