అంగరంగ వైభవంగా శ్రిఘాకొళ్ళపు వారి వివాహం

0
476
వధూవరులను ఆశీర్వదించిన సిఎం జగన్‌
తరలి వచ్చిన అతిరధమహారధులు- విభిన్న రుచులతో ఆత్మీయ ఆతిధ్యం
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 9 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రిఘాకొళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం,మీనాక్షి దంపతుల కుమార్తె అమృతవల్లి వివాహం సికింద్రాబాద్‌కు చెందిన శ్రీరంగనాథ్‌తో ఈ ఉదయం ప్రభుత్వ ఆర్ట్సు కళాశాల సమీపంలోని మంజీరా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డితో సహ పలువురు మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి  సభ్యులు, పలు పార్టీల నాయకులు, ప్రముఖులు ఆశీర్వదించారు. వివాహా కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం జగన్‌ లాలాచెరువు వద్ద ఉన్న అర్బన్‌ ఎస్‌.పి.కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకున్నప్పుడు ఆయనకు  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ శాఖ మంత్రి పిల్లి సుబోస్‌ చంద్ర బోస్‌, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌,రాజానగరం శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌,కాకినాడ పార్లమెంట్‌ సభ్యులు వంగా గీత,అమలాపురం పార్లమెంట్‌ సభ్యులు చింత అనురాధ, రంపచోడవరం శాసన సభ్యులు నాగులపల్లి ధనలక్ష్మీ, కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్‌,రామచంద్రపురం శాసనసభ్యులు చెల్లుబోయిన  వేణుగోపాలక ష్ణ, నిడదవోలు శాసన సభ్యులు జి.ఎస్‌.శ్రీనివాస నాయుడు, జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి, ఏలూరు డి.ఐ.జి-ఏ.ఎస్‌.ఖాన్‌,రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్‌.పి-షిమోషీ బాజ్‌పాయ్‌, సబ్‌-కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, కుడిపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీరాజు, మేడపాటి షర్మిళారెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికినవారిలో వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here