అండగా ఉంటా.. ఆశీర్వదించండి..

0
209
రాజమహేంద్రవరంలో వైద్యులతో రౌతు సమావేశం
రాజమహేంద్రవరం, మార్చి 27 : ” మీ శ్రేయోభిలాషిని.. ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటా.. గత పర్యాయాలు మీకు చేదోడు వాదోడుగా ఉన్నా.. ఈ సారి కూడా నన్ను ఆశీర్వదించండి.. అండగా ఉంటా’నని వైఎస్‌ఆర్‌ రాజమహేంద్రవరం నగర శాసనసభ అభ్యర్ది రౌతు సూర్యప్రకాశరావు నగరంలోని వైద్యులకు హామీ ఇచ్చారు.  ఆయన నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నగరంలోని వైద్యులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలకు వైద్య రాజధానిగా రాజమహేంద్రవరం నిలిచిందని కొనియాడారు. ఇలాంటి నగరలో సుపరిపాలన సాగాలని, శాంతియు వాతావరణం ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. నగరంలో ప్రశాంత వాతావరణ ఉండేలా పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు.  తనకు మద్ధతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, డాక్టర్స్‌ సెల్‌ నేతలు, నగరంలోని పలువురు వైద్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here