అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను ప్రోత్సహించాలి

0
71
ఎన్‌టిఆర్‌ మోమోరియల్‌ క్రికెట్‌ టోర్నిలో గన్ని
రాజమహేంద్రవరం, జనవరి 18: నగరంలో క్రీడలతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించి వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా వారిని తీర్చిదిద్దాలని గుడా మాజీ ఛైర్మన్‌ గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ మెమోరియల్‌ 10వ క్రికెట్‌ టోర్నమెంట్ను ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ప్రారంభిచారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరిలో క్రీడా స్ఫూర్తి ఉండాలని… తద్వారా సమజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు వారి ఖ్యాతిని విశ్వ వ్యాప్తంగా ఇనుమడింపచేసిన మహానుభావుడు ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్న ఉగ్గిన చంద్రశేఖర్‌ను అభినందించారు. ఎన్టీఆర్‌ రామారావు ఆశయ సాధనకు కార్యకర్తల్లా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నక్కా దేవి, మాజీ కార్పొరేటర్‌ కడలి రామకృష్ణ, కడితి జోగరావు, ఉగ్గిన చంద్రశేఖర్‌, పితాని కుటుంబరావు, సూర్య నాయుడు, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కిరణ్‌రాజు, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు కొండలరావు, వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here