‘అందరితో కలసి అందరి అభివృద్ధి’ బిజెపి ధ్యేయం

0
101
పార్టీ రాష్ట్ర ఇన్చార్జి  సునీల్‌ దియోధర్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : రాజమండ్రి రూరల్‌  రాజవోలులో జరిగిన బిజెపి సమావేశంలో పలువురు బిజెపిలో చేరారు. బిజెపి జోనల్‌ ఇంచార్జి సూర్య సుంకవల్లి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఇన్చార్జి సునీల్‌ దియోధర్‌, ఎమ్మెల్సీ  సోము వీర్రాజు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దియోధర్‌ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయవాదం కలిగిన పార్టీ అని పేర్కొన్నారు. దేశ ప్రజలందరి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పని చేస్తుందని పేర్కొన్నారు. అందరితో కలసి అందరి అభివృద్ధి అనేది బిజెపి విధానమన్నారు.ఈ కార్యక్రమంలో సుంకవల్లి సూర్య. ఒంటెద్దు స్వామి స్వామి గుర్రాల వెంకట్రావు. మోది సత్తిబాబు, ఏపీ ఆర్‌ చౌదరి, యానాపు యేసు, గోంగుల గోపి శ్రీనివాస, ములగాడ శివ. ఆడప వరప్రసాద్‌. సుంకవల్లి సూర్య  భాస్కర్‌, ఆచారి  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here