అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు జరగాలి

0
384
గోదావరి ఎస్టేట్స్‌ అండ్‌ కనస్ట్రక్షన్స్‌ ప్రారంభోత్సవంలో ఎంపి మురళీమోహన్‌
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 6: పేద, మధ్య తరగతి ప్రజల అభిరుచులకు అనుగుణంగా అందుబాటు ధరల్లో గృహాలు లభ్యమయ్యేలా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కృషి చేయాలని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ అన్నారు. లాలాచెరువు నుంచి క్వారీ మార్కెట్‌కు వచ్చే దారిలో ఉన్న గాయత్రినగర్‌లో నూతన భవనంలో ఏర్పాటు చేసిన గోదావరి ఎస్టేట్స్‌ అండ్‌ కనస్ట్రక్షన్స్‌ సంస్థను మురళీమోహన్‌ ప్రారంభించారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ చాంబర్‌ను గుడా చైర్మన్‌ గన్నికృష్ణ, సయ్యద్‌ అమజద్‌ చాంబర్‌ను మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఆడిటింగ్‌ చాంబర్‌ను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, అడ్మినిస్ట్రేషన్‌ చాంబర్‌ను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఇంజనీరింగ్‌ చాంబర్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధర్‌రావు, స్టాఫ్‌ రూమ్‌ను నాల్గవ డివిజన్‌ కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి ప్రారంభించారు. గత ఆరు సంవత్సరాల నుండి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాణిస్తున్న ఈ సంస్థ మరింత ఎదగాలని, వినియోగదారుల అభిష్టాలకు అనుగుణంగా గృహాలు అందిస్తూ దినదిన ప్రవర్ధమానం చెందాలని ముఖ్య అతిధులు ఆకాంక్షించారు. సంస్థ నిర్వాహకులు కొత్తపల్లి చిన్ని ముఖ్య అతిధులకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ముంబాయిలో బ్రాంచి ఉందని, త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here