అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

0
137
పంతం కొండలరావు ఆధ్వర్యంలో వేడుకలు
రాజమహేంద్రవరం, జనవరి 14 : స్నేహ, సౌభ్రాతృత్వాలను పెంపొందించడంతోపాటుగా సంస్క తి, సాంప్రదయాలను పరిరక్షించుకోవడానికి సంక్రాంతి సంబరాలు దోహదం చేస్తాయని నగర ప్రముఖులు పేర్కొన్నారు. స్దానిక లలితానగర్‌లోని నామన ధనరాజు వీధిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా జరిగాయి. పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పంతం కొండలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నామన ధనరాజు, శ్రీమతి సూర్యావతిల జ్ఞాపకార్ధం37,42 వార్డుల పరిధిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఒకరితో మరొకరు పోటీపడేవిధంగా మహిళామణులు వేసిన ముగ్గులు అందరిని ఆలరించాయి. లలితానగర్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిలుగా ఎంపి మార్గాని భరత్‌రామ్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం నగర నియోజవర్గ కోఆర్డినేటర్‌ శ్రిఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,  గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ చల్లా శంకరరావు, వైకాపా నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, ప్రముఖ కాంట్రాక్టర్‌ ఆర్‌.సుబ్బరాజు, బైరాజు ప్రసాదరాజు, మేడపాటి షర్మిలారెడ్డి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, యెనుమల రంగబాబు, కంచుమర్తి చంటి, మళ్ళ వెంకట్రాజు, చాంబర్‌ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బూర్లగడ్డ సుబ్బారాయుడు, పడాల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here