అంబేద్కర్‌ ఆశయ సాధనకు పునరంకితమవుదాం

0
265

రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకల్లో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 14 : ప్రపంచంలోనే ధీటైన రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నగరంలో పలుచోట్ల జరిగిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తొలుత 42వ డివిజన్‌లోని మున్సిపల్‌ కాలనీ పార్కులో మళ్ళ వెంకట్రాజు ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. అక్కడ నుండి కోటిలింగాలపేటలో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత క్వారీ సెంటర్‌లోని సుబ్బారావునగర్‌ వద్ద అడిషినల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాచపల్లి ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఆ తరువాత కంబాలపేట వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం 13వ డివిజన్‌లోని తాడితోట వద్ద కార్పొరేటర్‌ పాలిక శ్రీను, కో-ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతోపాటు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న ప్రధాని మోడీ సర్కార్‌కు బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అక్కడ నుండి బొగ్గుల దిబ్బ ప్రాంతానికి చేరుకుని అక్కడున్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ ఆయన భిక్ష వల్లే బడుగు, బలహీనవర్గాలు ఈనాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారని, ఆయన ముందు చూపుతో, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని సమానత్వం చూపేందుకు రాసిన రాజ్యాంగం అమూల్యమైనదన్నారు. అంబేద్కర్‌ ఆలోచనా విధానానికి, ఆయన రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మళ్ళ వెంకట్రాజు, ఎల్‌.వి.ప్రసాద్‌, రొంపిచర్ల ఆంథోని, చిన్నబాబు, రేవాడ సత్యనారాయణ, ఆశపు సత్యనారాయణ, గుడాల జాన్సన్‌, ఉసురుమర్తి ఆనంద్‌, గన్నవరపు సంజయ్‌, జె.బి.గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here