అంబేద్కర్‌ కృషి నిత్య స్మరణీయం

0
263
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 29 : సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ చేసిన క షి నిత్య స్మరణీయమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌ అన్నారు. అంబేద్కర్‌ రాజమహేంద్రవరంలో పర్యటించి 74 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా షెడ్యూల్డ్‌ కేస్ట్స్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ సొసైటీ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాశి నవీన్‌ కుమార్‌ ముఖ్య అతిధిగా పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ 1944లో అంబేద్కర్‌ రాజమహేంద్రవరం విచ్చేసారని, ఆ సమయంలో ఆయనకు పౌర సన్మానం చేసారని అన్నారు. కాస్మోపాలిటన్‌ క్లబ్‌, టౌన్‌ హాల్‌లను కూడా ఆయన సందర్శించారని, నగర ప్రముఖులు కుసుమ ధర్మన్న, జాలా రాధాస్వామిలు ఏర్పాట్లు చేశారని అన్నారు. భావి తరాలను ద ష్టిలో పెట్టుకుని అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లే బడుగు, బలహీన వర్గాలు అభివ ద్ధి చెందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్‌, జార్జ్‌ ఆంథోని, సమతం గన్నెయ్య, రామారావు,సోమాబత్తుల విజయ్‌ కుమార్‌,జాలా మదన్‌, ప్రశాంతి, ఎలిపే శ్రీనివాస్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here