అజాద్‌ చౌక్‌లో అబ్దుల్‌ కలాం జయంతి 

0
167
రాజమహేంద్రవరం, నవంబర్‌ 11 : స్థానిక జాంపేటలో గల ఆజాద్‌ చౌక్‌ వద్ద  మౌలాలి అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ 131 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం సిటీ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్‌ శ్రీఘకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఫ్లోర్లీడర్‌ షర్మిలారెడ్డి, వైసిపి నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాసు, ఎండి కరీం ఖాన్‌, అసదుల్లా అహ్మద్‌, రబ్బానీ, సభ నం అప్సర్‌, అమీర్‌ భాషా, చాంద్‌ భాషా, షహేన్షా, ఎండి హరీష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి సారిగా విద్యా మంత్రి అని అలాగే ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చారని, అలాగే ఆయన జన్మదినోత్సవం మైనార్టీ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here