అజ్జరపు వాసుకి ‘శాప్‌’లో అవకాశం కల్పిస్తా : ఎంపి మార్గాని భరత్‌

0
163
రాజమహేంద్రవరం, జనవరి 14 : రాష్ట్ర క్రీడాభివృద్ది సంస్ధ(శాప్‌)లో మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసుకి అవకాశం కల్పిస్తామని రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్‌రామ్‌ హామీనిచ్చారు. శ్రీలక్ష్మీసుందరరావు జ్ఞాపకార్ధం అజ్జరపు వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో విజేతలకు, సంక్రాంతి పండగ సందర్బంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. స్ధానిక పనసచెట్టుసెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపి మార్గాని భరత్‌రామ్‌ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. క్రికెట్‌ టోర్నమెంట్‌లు నిర్వహిస్తూ క్రీడాభివృద్దికి అజ్జరపు వాసు కృషి చేస్తున్నారని, శాప్‌లో పదవిని ఇవ్వడం ద్వారా ఆయన సేవలను క్రీడారంగంలో మరింతగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లుగా ఎంపి తెలిపారు. క్రికెట్‌ టోర్నమెంట్‌లో మొదటి బహుమతిగా రూ.5వేలు, రెండవ బహుమతిగా రూ.3 వేలు ముఖ్యఅతిధిల చేతుల మీదుగా అందచేశారు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులుగా బీరువా, డ్రస్సింగ్‌ టేబుల్‌, మిక్సిలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ,ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ, మాజీ ఎమ్మెల్య రౌతు సూర్యప్రకాశరావు, నాయకులు నందెపు శ్రీనివాస్‌, నక్కా శ్రీనగేష్‌, గుత్తుల మురళీధరరావు,  బాపిరెడ్డి, మంగరాజు వజ్రనాధ్‌, శేఖర్‌, రమేష్‌, బత్తిన గంగరాజు, ఎర్ర ప్రసాద్‌, బొక్కా సుధాకర్‌, రాపాక అబ్బులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here