అత్యంత వెనుకబడిపోయిన కులాల అభివృద్దికి ప్రభుత్వం కృషి

0
258
ఎంబిసి చైర్మన్‌ కాకి గోవిందరెడ్డి ఘన సత్కారం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : అత్యంత వెనుకబడిపోయిన కులాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఎంబిసి చైర్మన్‌ కాకి గోవిందరెడ్డి చెప్పారు. స్ధానిక నిర్మల గ్రాండ్‌లో ఎంబిసి చైర్మన్‌ కాకి గోవిందరెడ్డిని మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, కార్పొరేటర్లు కొమ్మ శ్రీనివాస్‌, కురగంటి ఈశ్వరి, కోసూరి చండీప్రియ, బెజవాడ రాజ్‌కుమార్‌, కోఆప్షన్‌ సభ్యురాలు కప్పుల వెలుగుకుమారి, నాయకులు రెడ్డి మణి, షేక్‌ సుభాన్‌, బొమ్మనమైన శ్రీనివాస్‌, బుడ్డిగ రాధ, దారపు ప్రసాదరెడ్డి, దాలిపర్తి వేమన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ కులధృవీకరణ పత్రాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అర్హత కలిగినవారందరికి జాప్యం లేకుండా కులధృవీకరణపత్రాలు జారీ అవుతున్నాయన్నారు. బాగా వెనుకబడిన కులాలకు సంక్షేమ కార్యక్రమాలు కార్పొరేషన్‌ ద్వారా అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్బంగా బాగా వెనుకబడిన కులాలకు సంబంధించిన సమస్యలను కార్పొరేషన్‌ చైర్మన్‌ కాకి గోవిందరెడ్డి దృష్టికి  దాలిపర్తి వేమన తీసుకువచ్చారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here