అదే స్పందన.. అదే ఆప్యాయత

0
243
ఉత్సాహంగా సాగుతున్న టిడిపి నగర దర్శిని
రాజమహేంద్రవరం, జులై 17 : ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. నగర దర్శిని కార్యక్రమంలో భాగంగా స్థానిక 1వ డివిజన్‌ పరిధిలోని బూత్‌ నెంబర్‌ 87, 88, 89 సైక్లోన్‌ కాలనీ, సాయి దుర్గా నగర్‌, వర్కర్స్‌ కాలనీ, నారాయణపురం వాంబే కాలనీలలో ప్రజా సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకర్రావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు తదితరులు నగరదర్శిని-నగరవికాసం కార్యక్రమంలో ఇంటింటికి పర్యటించారు. టీడీపీ ప్రభుత్వ నేతృత్వంలో సిఎం చంద్రబాబు అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ భరోసా, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారా? లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు. ఆయా పథకాలు పొందడానికి అర్హత ఉంటే ఎలా పొందాలన్న దానిపై సాధికార మిత్రలను అడిగి అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ప్రతీ కుటుంబం ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్న లక్ష్యంతో సిఎం చంద్రబాబు నగరదర్శిని కార్యక్రమాన్ని రూపొందించారు. గడచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నేరవేర్చడంతో పాటు ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వ బాధ్యతగా గుర్తెరిగి మేలు చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. సిటీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని గృహాలను బృందాలుగా ఏర్పడి పర్యటన చేయడం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును మరోసారి సిఎం చేయడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయన్నారు. చంద్రబాబు మరోసారి సిఎంగా బాధ్యతలు చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు,  ఫ్లోర్‌ వర్రే శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌ కోరిమెల్లి విజయ శేఖర్‌, యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోసూరి చండీప్రియ, గరగా పార్వతి, టీడీపీ నాయకులు మానే దొరబాబు, అట్టాడ రవి, సూరంపూడి శ్రీహరి, మరుకుర్తి రవియాదవ్‌, మళ్ల వెంకట్రాజు, మేరపురెడ్డి రామకృష్ణ, గరగా మురళీకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here