అధికార పార్టీ తప్పిదాలే అస్త్రంగా ముందుకు సాగుదాం

0
91
తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 28 : అధికార పార్టీ వారు చేసే తప్పులనే అస్త్రాలుగా చేసుకుని, వారి ఒత్తిళ్లను తిప్పి కొడుతూ ముందుకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించారు. స్థానిక జగదీశ్వరి హొటల్‌లో ఈరోజు టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ నగరంలో నెలకొన్న ప్రతి సమస్యపై స్పందించాలని కమిటీకి సూచించారు. ప్రతి నెలా 9 నుంచి 14వ తేదీలోగా డివిజన్‌ కమిటీ సమావేశాలు నిర్వహించుకుని స్థానిక సమస్యలపై చర్చించుకుని సమన్వయ కమిటీ సమావేశానికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. కౌన్సిల్‌ లేని కారణంగా నగరంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, అమృ త పథకంలో అభివృద్ధి పనులు ఇష్టానుసారంగా చేస్తున్నారని అన్నారు.  తెలుగుదేశం పార్టీ హయాంలో 70 నుంచి 80  కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించి జీవోలు తీసుకువచ్చామన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లను ఆ పార్టీ వారే వేధిస్తున్న కారణంగా ఇటీవల ఒక వాలంటీరు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. కేడరంతా ఒకే తాటిపై ఉండి అన్ని ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గుడా మాజీ ఛైర్మన్‌ గన్ని కృ ష్ణ మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్న క్యాంటిన్లను మూసి వేసి పేదల కడుపు కొట్టిందన్నారు. అలాగే ప్రజా సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీరుపట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, పథకాలను ఎవరి కోసం ఎందుకు అమలు చేస్తున్నారో తెలియని గందరగోళంలో ప్రజలు ఉన్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు గోపాల రాయుడు మాట్లాడుతూ సమన్వయ కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలపై అందరం కలిసి విజిట్‌ పెట్టుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఒక నిర్ధిష్టమైన కార్యాచరణలో ముందుకు వెళదామన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వారి ఎత్తుగడలను తిప్పి కొట్టాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ పార్టీ కేడర్‌ అన్ని పనుల్లో నిమగ్నమవ్వాలని కోరారు. ఛాంబర్‌ ఎన్నికలు, అలాగే త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ, వివిధ బ్యాంకుల ఎన్నికల్లో కూడా మనమే విజయం సాధించాలని, అందుకు అందరూ కలసి కట్టుగా పని చేయాలన్నారు. బోటు ప్రమాద మృతులకు, కోడెల, వేణుమాధవ్‌ల మృతికి సంతాపం
బోటు ప్రమాద మ తులు, ఇటీవల మృతి చెందిన నవ్యాంధ్ర ప్రదేశ్‌ తొలి స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు, మాజీ ఎంపీ, నటుడు  శివ ప్రసాద్‌,  సినీ యాక్టర్‌ వేణు మాధవ్‌ల మ తికి సమన్వయ కమిటీ సంతాపం వ్యక్తం చేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో నగర టీడీపీ అధ్యక్షులు, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, నాయకులు ఛాన్‌ భాషా, ఛాన్‌ భాషా, కరీంఖాన్‌, వెలుగు కుమారి, పాలవలస వీరభద్రం, ద్వారా పార్వతి సుందరి, పితాని లక్ష్మి కుమారి, కడలి రామక ష్ణ, బుడ్డిగ రాధ, తురకల నిర్మల, బూరాడ భవానీ శంకర్‌, కడితి జోగారావు, యాళ్ల వెంకటరావు, తంగెళ్ల బాబి, బొమ్మనమైన శ్రీనివాస్‌, జక్కంపూడి అర్జున్‌, ఇన్నమూరి రాంబాబు, మంచాల బాబ్జి, జోగినాయుడు, గొర్రెల రమణి, కర్రి రమణమ్మ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here