అనధికార లే అవుట్లు తొలగించిన ‘గుడా’

0
248
రాజమహేంద్రవరం, జనవరి 9: అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అనధికార లే.అవుట్లను గుడా టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ తొలగించింది.  గుడా వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కోలమూరు పంచాయితి పరిధిలో గల రాయుడు పాకలు గ్రామంలో రెండు, కడియం మండలం కడియపుసావరంలో రెండు అనధికార లే అవుట్లను తొలగించారు.అనధికార లే అవుట్లను గుర్తించిన అధికారులు సంబంధిత స్థల యజమానులకు నోటీసులు అందించినా సమాధానం ఇవ్వకపోవడంతో గుడా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఆ నాలుగు లే అవుట్లను తొలగించారు. గుడా జూనియర్‌ ఆఫీసర్లు ప్రసాదరావు, శ్రీధర్‌, సిబ్బంది సూర్యనారాయణ, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here