అనాధ బాలలకు గన్ని కృష్ణ బాణాసంచ వితరణ

0
181
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  29 : దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. స్పందన స్వచ్చంధ సేవా సంస్ధ తరఫున గోదావరి గట్టున ఉన్న శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘంలో అనాధ బాలలకు బాణాసంచ, మిఠాయిలను గన్ని కృష్ణ అందజేశారు.  ఈ సందర్భంగా తెదేపా నాయకులు నిమ్మలపూడి గోవింద్‌ మాట్లాడుతూ  దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలన్న ఉద్ధేశ్యంతో స్పందన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తలపెట్టామన్నారు. స్పందన అధ్యక్షులు, తెదేపా నేత గన్ని కృష్ణ జన్మదినోత్సవ వేడుకలను వచ్చే నెల 22న ఇక్కడే ఘనంగా నిర్వహిస్తామని, అనాధ బాలలకు భోజన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, చించినాడ తాతాజీ, ముత్య  సత్తిబాబు., ఉప్పులూరి జానకిరామయ్య, శెట్టి జగదీష్‌, మద్ది నారాయణరావు, జీవకారుణ్య సంఘం ఇఓ ఆర్‌.శ్రీనివాస్‌, కాట్రు రమణకుమారి, కాట్రు లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.