అనాధ బాలలకు జీకె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ బాణాసంచ పంపిణీ 

0
315
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8 : సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలన్నదే జికె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ ఉద్దేశ్యమని ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా గోదావరి గట్టున ఉన్న గౌతమీ జీవకారుణ్య సంఘంలో చిన్నారులకు జికె స్పందన ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బాణాసంచా, స్వీట్లు పంపిణీ చేశారు. గన్నికృష్ణ, ఆయన సతీమణి రాజేశ్వరి, కుమార్తె స్మిత తదితరులు పాల్గొని చిన్నారులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ దీపావళి పండుగను జీవకారుణ్య సంఘం చిన్నారులు సైతం ఆనందంగా జరుపుకోవాలని భావించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, కార్పొరేటర్‌ మాటూరి రంగారావు, పార్టీ యువనాయకులు యిన్నమూరి దీపు, శెట్టి జగదీష్‌, నిమ్మలపూడి గోవింద్‌, తవ్వా రాజా, మళ్ళ వెంకట్రాజు, దంతులూరి వెంకటపతిరాజు, వానపల్లి సాయిబాబా, ఎంఎ.రషీద్‌, శనివాడ అర్జున్‌, జీవకారుణ్య సంఘం ఈఒ పితాని తారకేశ్వర్రావు, అధికారులు మోహనరావు, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here