అనుమతుల ఆధారంగానే గృహ నిర్మాణాలు  చేపట్టాలి

0
134
ప్రపంచ టౌన్‌ ప్లానింగ్‌ దినోత్సవంలో కమిషనర్‌
రాజమహేంద్రవరం,నవంబర్‌ 8 : నగర పాలక సంస్థ పరిధిలో గృహ నిర్మాణాలకు సంబంధించి సంబంధిత పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతుల ఆధారంగానే గృహ నిర్మాణాలు  చేపట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. ప్రపంచ టౌన్‌ ప్లానింగ్‌ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈరోజు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోటిపల్లి బస్టాండు నుంచి పుష్కర ఘాట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నగర పాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగర పరిధిలో నిర్మించే భవన నిర్మాణాలను భవననిర్మాణ అనుమతులకు అనుగుణంగానే నిర్మించుకోవాలన్నారు. అలాగే ప్రతీ గృహానికి రక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ గృహ ఆవరణలో భూగర్భజలాలను రక్షించుకునేందుకు వీలుగా ఇంకుడుగుంటలు నిర్మించుకోవాలని కోరారు. అదేవిధంగా ఇస్టారీతిగా గోడపత్రికలను అంటించరాదని, సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే పచ్చదనం-పరిశుభ్రత పాటించాలన్నారు. సిటీ ప్లానర్‌ వరప్రసాద్‌ మాట్లాడుతూ నగరాల నిర్మాణంలో ప్రజలను అనుసంధానం చేస్తూ ఒక ప్రత్యేక వేదిక పై చర్చించుకునే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 1949లో ఈ టౌన్‌ ప్లానింగ్‌ అనేది ఆవిర్భవించిందన్నారు. ఈ ర్యాలీలో టౌన్‌ ప్లానింగ్‌ రీజనల్‌ డిప్యూటీ డైరక్టర్‌ వై.పి.రంగనాయకులు, అసిస్టెంట్‌ డైరక్టర్‌ మధుకుమార్‌, ఎసిపిలు సత్యనారాయణరాజు, వరహాలబాబు, వై.వెంకట రత్నం, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరపాలక సంస్థలో క్రెడాయ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతోనూ, లైసెన్స్‌ సర్వేయర్‌ లు అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి టౌన్‌ ప్లానింగ్‌లో విశిష్ట సేవలు అందించిన విశ్రాంతి ఎసిపిలు రంగప్రసాద్‌, శేషగిరిరావు, జిల్లా ప్లానింగ్‌ ఆఫీసర్‌ సత్యనారాయణలను ఘనంగా సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here