అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గన్ని 

0
284
రాజమహేంద్రవరం,  నవంబర్‌ 10 : కోరుకొండ రోడ్డులో బ్రదరన్‌ చర్చి ఎదురుగా ఉన్న శ్రీకనకదుర్గ , సాయిబాబా ఆలయంలో ఈరోజు నుంచి ప్రతి గురు, శుక్రవారాల్లో  అన్నదానం నిర్వహించేందుకు శ్రీకనకదుర్గ సాయి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాస్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ  ముఖ్య అతిధిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ పాలవలస వీరభద్రం, తెదేపా నాయకులు కంటిపూడి శ్రీనివాస్‌, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.