అన్నవరం సత్యదేవుడ్ని దర్శించుకున్న గన్ని కృష్ణ

0
193

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 11 : గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు గన్ని కృష్ణ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మారిశెట్టి జితేంద్ర, ఇతర అధికారులు గన్నికి స్వాగతం పలికారు. పండితులు వేదాశీస్సులు అందజేశారు. గన్నితో పాటు ఆయన సతీమణి రాజేశ్వరి, కుమార్తె స్మిత తదితరులు ఉన్నారు. అనంతరం గన్ని ఆలయంలో నిత్యన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. నిత్యన్నదానశాల నిర్వహణ, ఆహార పదార్ధాల రుచి ఎంతో బాగున్నాయంటూ ఈ సందర్భంగా గన్ని కితాబిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here