అన్ని వర్గాల సంతృప్తే ప్రభుత్వ లక్ష్యం

0
196
రాష్ట్ర  అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు
ఐసిడిఎస్‌ అధ్వర్యంలో ఘనంగా సామూహిక సీమంతాలు
రాజమహేంద్రవరం,జనవరి 5: రాష్ట్రంలో అన్ని వర్గాల సంతృప్తే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని, ఇప్పటికే 80 శాతం మంది ప్రజలు ఆనందంగా ఉన్నారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 25,29,30,31 డివిజన్‌లో కార్పొరేటర్లు కురగంటి ఈశ్వరి,మజ్జి పద్మ,మెర్సీ ప్రియ, మజ్జి నూకరత్నం అధ్వర్యంలో ఆయా డివిజన్లలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్ని కృష్ణ,ఆదిరెడ్డితో పాటు జన్మభూమి నోడల్‌ ఆఫీసర్‌ శాంతి ప్రియ పాండే  పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ప్రభుత్వ పథకాలను వివరించారు.అనంతరం గన్ని కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తుంటే బిజెపి, వైకాపా, జనసేన అడ్డుకుంటున్నాయని అన్నారు. అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా వాటిని అధిగమిస్తూ చంద్రబాబు నిర్మాణాన్ని వేగవంతం చేశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఆర్ధిక లోటుతో సతమతమవుతున్నా  ప్రజల కోసం సంక్షేమ పథóకాల విషయంలో చంద్రబాబు ఎక్కడా రాజీపడటం లేదని అన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఇంతకన్నా రాష్ట్ర అభివృద్ధికి ఎవరూ క షి చేయలేరని, సంక్షేమ పాలన చంద్రబాబుకే సాధ్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పధకాలు అందించే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరు అయిన రేషన్‌ కార్డులను, చంద్రన్న సంక్రాంతి కానుకలను గన్ని  కృష్ణ పంపిణీ చేశారు. ఐ.సి.డి.ఎస్‌.ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. బాలింతలకు బాలామృతం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, అర్బన్‌ తహశీల్దారు రాజేశ్వరరావు, నగరపాలక సంస్థ ఈఈ సత్యకుమారి, కోటేశ్వరరావు, సిటి ప్లానర్‌ వరప్రసాద్‌, ఐసిడిఎస్‌ అధికారిణి విజయలక్ష్మి, దుర్గా మణి, స్థానిక నాయకులు మజ్జి శ్రీనివాసరావు, రంభ యరకేశ్వర రావు, నల్లం ఆనంద్‌, గుణపర్తి శివ,తలారి భాస్కర్‌,మాలే విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు
పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here