అన్న క్యాంటిన్లలో హెరిటేజ్‌ పెరుగు ప్రచారం వాస్తవంకాదు 

0
224
క్వారీ మార్కెట్‌లో క్యాంటిన్‌ను సందర్శించిన గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, జులై 28 : పేదవారికి అతి చౌకగా అల్పాహారాన్ని, భోజనాన్ని అందించేందుకు ఉద్ధేశించిన  అన్న క్యాంటిన్ల పని తీరుపట్ల ప్రజలు సంతృఫ్తి వ్యక్తం చేస్తున్నారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. ఈ క్యాంటిన్లను పకడ్బంధీగా, పటిష్టవంతంగా అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. అన్న క్యాంటిన్లకు అనేక మంది విరాళాలు అందజేస్తున్నారని, భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని గన్ని అన్నారు. క్వారీ ప్రాంతంలోని అన్న క్యాంటిన్‌ను గన్ని ఈరోజు పరిశీలించారు. అన్న క్యాంటిన్‌ ద్వారా పట్టెడన్నం తింటున్నామని, తమ వంటి పేదవారి కోసం ఈ క్యాంటిన్లను  ప్రారంభించిన సీఎం చంద్రబాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలని, తమ లాంటి వారిపట్ల దేవుడు చంద్రబాబు అని  ఓ మహిళ గన్ని కృష్ణ వద్ద తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా అన్న క్యాంటిన్లలో హెరిటేజ్‌ పెరుగును వినియోగిస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని గన్ని అన్నారు. అక్కడే ఉన్న వేరే సంస్థకు చెందిన పెరుగు ప్యాకెట్లను ఆయన ఈ సందర్భంగా  చూపారు. గన్ని వెంట ఎస్సీ కార్పొరేషన్‌ డైరక్టర్‌ దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, రవి యాదవ్‌, కవులూరి వెంకట్రావ్‌ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here