అన్న క్యాంటిన్ల వద్ద అరాచకవాదుల చేష్టల్ని అరికట్టండి

0
962
పోలీసు యంత్రాంగానికి గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ విజ్ఞప్తి
రాజమహేంద్రవరం, జులై 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటిన్ల నిర్వహణపై ప్రజల నుంచి వస్తున్న స్పందన అమోఘమని, అయితే రాత్రి సమయాల్లో కొంతమంది అరాచకవాదుల చేష్టలను పోలీసులు అరికట్టాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటిన్‌ను ఈరోజు గన్ని ఆకస్మికంగా సందర్శించారు. అన్న క్యాంటిన్‌లో భోజనం చేసేందుకు సిద్ధంగా ఉన్న కొందరు వ్యక్తులతో ఆయన మాట్లాడి నిర్వహణపై ఆరా తీశారు. భోజనం చాలా రుచికరంగా ఉంటోందని సీఎం చంద్రబాబునాయుడు అన్న  క్యాంటిన్ల ద్వారా నిరుపేదలకు ఎంతో మేలు చేశారని పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గన్ని అన్న క్యాంటిన్ల పర్యవేక్షకులతో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీశారు. పూటకు 500 మందికి అల్పాహారం, భోజనం సమకూరుస్తున్నామన్నారు. అన్న క్యాంటిన్ల ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలే ఈ పథకాన్ని కాపాడుకోవాలన్నారు. అరాచక శక్తులు హడావిడి చేస్తే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గన్ని వెంట మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, గరగ పార్వతి, కో-ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ, టిడిపి నాయకుడు మునుకోటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here