అపోహలు వీడి ఆవశ్యకతను గుర్తెరగాలి

0
284
జెసిఐ రక్తదాన శిబిర ప్రారంభంలో వక్తలు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 2 : రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి ఆవశ్యకతను గుర్తెరగాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. జెసిఐ రాజమండ్రి  శాఖ ఆధ్వర్యంలో స్ధానిక జాంపేట ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జెసిఐ నగర శాఖ అధ్యక్షుడు దొంతంశెట్టి సుధాకర్‌ ఆధ్వర్యంలో జరిగిన రక ్తదాన శిబిరాన్ని జాంపేట బ్యాంక్‌ చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, గన్ని కృష్ణ, డిఎస్పీ త్రినాధరావు, బిజెపి మహిళా మోర్చా  రాష్ట్ర కార్యదర్శి నాళం పద్మశ్రీ, తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు గుబ్బల రాంబాబు, జాంపేట అర్బన్‌ బ్యాంక్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కాలెపు సత్యనారాయణమూర్తి, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అడ్మిన్‌ అనూప్‌జైన్‌ సందర్శించారు. తొలుతగా దొంతంశెట్టి సుధాకర్‌, జెసిఐ పూర్వాధ్యక్షులు నిమ్మలపూడి గోవింద్‌ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా   ముఖ్య అతిధులు మాట్లాడుతూ జెసిఐ సంస్ధ నగరంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. రక్తదానంపై యువతకు  మరింత అవగాహన కల్పించాలని, రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని  సూచించారు. అనంతరం గంగరాజు డెయిరీ అధినేత నిమ్మలపూడి గోవింద్‌ సౌజన్యంతో ఓ వికలాంగురాలికి వీల్‌చైర్‌ను అందజేశారు. ఆ వికలాంగురాలు చర్మ వ్యాధులతో  బాధపడుతుండటంతో స్పందించిన గన్ని కృష్ణ వెంటనే ప్రముఖ చర్మవ్యాధుల వైద్య నిపుణులు డా. ఆరుమిల్లి ప్రసాద్‌చౌదరికి ఫో న్‌ చేసి ఆమెకు వైద్య సహాయం అందించాలని కోరగా ఆయన తన సమ్మతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెసిఐ ప్రతినిధులు కంచర్ల కృష్ణస్వామి,టి.భరత్‌కుమార్‌,  సుమ నగేష్‌, మనుకొండ శ్రీనివాసరావు, మద్ది నారాయణరావు, పవన్‌కుమార్‌ జాజు, తొంటెపు నాగశ్రీరామ్‌, ఇందీవర శ్యామ్‌, జయవరపు రవి, రాజమండ్రి రైజింగ్‌ ప్రతినిధులు మాటూరి సిద్ధార్ధ, నామన శ్రీకాంత్‌, మండవిల్లి హరనాథ్‌, ధన్వంతరి బ్లడ్‌ బ్యాంక్‌ వైద్యులు డా.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.