అభివృద్ధిని చూసి ఓర్వలేకే బాబుపై విమర్శలు

0
278
49వ డివిజన్‌లో కొనసాగిన తెదేపా నగర దర్శిని
రాజమహేంద్రవరం ఆగస్టు 20 : రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకే బిజెపి, వైకాపా, జనసేన పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 49వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ నగర దర్శిని కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు ఏ విధంగా వాటిని సద్వినియోగపరుచుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. భావి తరాల భవిష్యత్తుకు కృషిచేస్తున్న చంద్రబాబుకు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. నిత్యం ప్రజల్లో ఉంటూ  సమస్యల పరిష్కారానికి తాము కృషిచేస్తున్నామని, మాయమాటలు చెప్పే నాయకులను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో  ఆదిరెడ్డి వాసు, ఆశపు సత్యనారాయణ, రావాడ సత్యనారాయణ, నేమాని శ్రీను, బొచ్చా శ్రీను, కడితి జోగారావు, మేరపురెడ్డి రామకృష్ణ, మెహబూబ్‌ఖాన్‌, కర్రి రాంబాబు, జాగు వెంకటరమణ, రొక్కం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here