అభివృద్ధిని వక్ర దృష్టితో చూడకండి

0
354
ప్రతిపక్షాలకు గోరంట్ల హితవు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 13 : రాష్ట్రంలో జరుగుతున్న మంచిని దయచేసి పవరూ వక్రదృష్టితో చూడవద్దని రాజమహేంద్రవరం రూరల్‌ పమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 60 లక్షల మంది రైతులతో చేయించే పరిస్థితి కల్పించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అటువంటి కార్యక్రమాన్ని తప్పుబట్టే పరిస్థితి వచ్చిందంటే వారిని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు. పంఓయూ అంటే ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని మాజీ పంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించారు. సస్టైనబుల్‌ ఇండియా ఫైనాన్స్‌ ఫెసిలిటీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 16, 800 కోట్లతో పంఓయూ కుదుర్చుకుందని… అయితే అది ఏ ఉద్దేశంతో కుదుర్చుకుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు.  ప్రకృతి వ్యవసాయం ద్వారా పరువులు లేని వ్యవసాయ ఉత్పత్తులు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, దానిని రాష్ట్రమంతా అమలు చేయడానికి రూ.  16, 800 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇక బీజేపీ నాయకులు చంద్రబాబు పట్ల అవాకులు… చవాకులు పలుకుతున్నారని… ఆ విధానం వారికి మంచిది కాదన్నారు. రాష్ట్రంతో ఆడుకున్నందుకే కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోయిందని… బీజేపీకి అదే పరిస్థితి పట్టబోతుందన్నారు.  అమిత్‌ షా ప్రపంచంలోనే పెద్ద దొంగని… ఈ నాలుగేళ్లల్లో అతని కుమారుడు లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌, పవన్‌ బీజేపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్‌ కకురగంటి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here