అభివృద్ధి కావాలో..అరాచకం కావాలో తేల్చుకునే తరుణమిది 

0
228
జగన్‌కు ఓటు వేస్తే రాష్ట్ర ద్రోహులు మోడీ,కెసిఆర్‌ల్ని సమర్ధించినట్టే
ఆంధ్రుల స్ధైర్యాన్ని దెబ్బ తీసే కుట్రల్ని తిప్పిగొడుదాం : గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, మార్చి 26 : రానున్న ఎన్నికల్లో జగన్మోహనరెడ్డికి ఓటేస్తే ఇటు కెసిఆర్‌, అటు మోడీలను సమర్థించినట్టేనని, ఈ విషయాన్ని ముస్లిమ్‌, క్రిస్టియన్‌ మైనార్టీలు  గమనించాలని, ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలు గాని, నిన్న జగన్‌ చేసిన వ్యాఖ్యలు గాని ఇందుకు నిదర్శనమని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎన్నడూ చూడని విధంగా దారుణాలు కనిపిస్తున్నాయని, జగన్‌ వ్యవహారశైలి, మాట తీరు జుగుప్సాకరంగా ఉంటున్నాయన్నారు.హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర మంత్రి గోయెల్‌ తన మాటల్లోనే కెసిఆర్‌, జగన్‌లు తమకు మంచి మిత్రులంటూ వ్యాఖ్యలు చేసి ముసుగు తీశారని, దానికి తోడు కెసిఆర్‌తో చెలిమి చేస్తే తప్పేమీటంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఆంధ్రుల్ని అవమానించి ప్రాజక్ట్‌లను అడ్డుకుంటున్న కెసిఆర్‌తో జగన్‌ కలిసి కుట్రలు చేయడం దారుణమన్నారు. జగన్‌కు ఓటేస్తే హైదరాబాద్‌ నుంచే పరిపాలన జరుగుతుందని,  ఆంధ్రుల ద్వేషి కెసిఆర్‌ను, ఆయనతో జత కడుతున్న జగన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ నుంచి తెదేపా బయటకు వచ్చాక  మోడీ పతనం ప్రారంభమైందని, దేశంలో ఆయనను ఎదిరించిన సత్తా చంద్రబాబు ఒక్కరికే ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎదురు తిరిగితే ఐటీ, ఈడీ దాడులతో బెదిరింపులకు పాల్పడ్డారని  ధ్వజమెత్తారు. ఆంధ్రుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు జరిగాయని అన్నారు. జగన్‌ మాయమాటలు నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో అరాచకత్వానికి అడ్డూ అదుపు ఉండవని, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయ్యాలని కోరారు. అభివృద్ధి కావాల్సిన వారు చంద్రబాబుకు, అరాచకం కావలసిన వారు జగన్‌కు ఓటేయ్యాలని గన్ని వ్యాఖ్యానించారు. విలేరుల సమావేశంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, పార్టీ నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య, మళ్ళ వెంకట్రాజు, మొల్లి చిన్నియాదవ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here