అభివృద్ధి నిరోధకులకు గుణపాఠం చెప్పాలి

0
201
11 వ డివిజన్‌లో తెదేపా నగర దర్శినిలో గన్ని
రాజమహేంద్రవరం, నవంబర్‌ 19 : రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న  పార్టీలకు బుద్ది చెప్పాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి అన్నారు. స్థానిక 11 వ డివిజన్‌లో ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర దర్శిని కార్యక్రమాన్ని కార్పొరేటర్‌ గగ్గర సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ కోడికత్తి ఘటనతో జగన్‌  ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడని, మరోవైపు పవన్‌ స్థిరత్వం లేని మాటలతో  సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం నమ్మించి మోసం చేయడంతో పాటు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మేయర్‌ మాట్లాడుతూ చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని, ఆయన నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు 111 పధకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, టిడిపి యువనాయకులు ఆదిరెడ్డి వాసు  మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధిక లోటుతో సతమవుతున్నా ప్రజలకు అవసరమైన సంక్షేమ పధకాలను ప్రవేశ పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాటూరి రంగారావు, కడలి రామకృష్ణ, పార్టీ నాయకులు పితాని కుటుంబరావు, మెహబూబ్‌ ఖాన్‌, శెట్టి జగదీష్‌, చొప్పెర్ల బ్రహ్మాజీ,బుడ్డిగ రవి, పుట్టా సాయిబాబా, జాగు వెంకటరమణ, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here