అభివృద్ధి ప్రదాతను నమ్మాలో.. ఆర్థిక నేరస్తుడిని నమ్మాలో తేల్చుకోండి 

0
172
చంద్రబాబు కష్టానికి అవార్డులు..రికార్డులే నిదర్శనం
కళ్ళుండి చూడలేని కబోధుల్ని నమ్మితే అధోగతే : జన్మభూమి సభల్లో గన్ని
రాజమహేంద్రవరం, జనవరి 8 : రాష్ట్ర అభివ ద్ధే లక్ష్యంగా సిఎం చంద్రబాబు చేస్తున్న కృషికి అవార్డులు, రికార్డులు లెక్కలేనన్ని వస్తున్నాయని, 24 గంటల్లో పోలవరం ప్రాజెక్టులో 33వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేసి గిన్నీస్‌ రికార్డ్‌ సాధించారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. ఇంత క షి చేస్తున్న చంద్రబాబును నమ్మాలో, అక్రమార్జనతో కేసులు ఎదుర్కొని జైలుకెళ్లిన జగన్‌ నమ్మాలో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. స్థానిక 43,44,45,46,47 డివిజన్లలో జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమానికి గుడా చైర్మన్‌ గన్నికృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి,డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, నమ్మించి మోసం చేసినా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా సిఎం చంద్రబాబు తెలుగు ప్రజల మద్దతుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో అందరూ చూడాలని, ఆయన పడుతున్న కృషికి రాష్ట్రానికి రాని అవార్డులు,రికార్డులు నమోదు అవుతున్నాయని అన్నారు. పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా తయారవుతుందన్నారు.మరోవైపు రాష్ట్ర రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, కేంద్రం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే  ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో రైతులు,డ్వాక్రా మహిళలు, ఇతర వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని, ఆయనతో పాటు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా లోకేష్‌  గ్రామీణ ప్రాంతాలలో చేస్తున్న అభివృద్ధి గతంలో ఎవరూ చేయలేదన్నారు. ఇన్ని అభివృద్ధి  కార్యక్రమాలు చేస్తుంటే కళ్ళు ఉండి చూడలేని  కబోధులు ఉండటం దురదృష్టకరమన్నారు.అలాంటి వ్యక్తుల మాయ మాటలు నమ్మి ఓట్లేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి సిఎంగా చంద్రబాబు రాకపోయి ఉంటే అంధకారంలో ఉండేవారమని, అందరి నమ్మకాలను నిలబెడుతూ అలుపెరుగని కృషి చేస్తున్న చంద్రబాబుపై మోడీ నుంచి జగన్‌ వరకు రకరకాల కుట్రలు చేస్తున్నారని, వారిని ఎదుర్కొంటూ అడ్డంకులను అధిగమిస్తున్నారని అన్నారు. మేయర్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల వారు ఆనందంగా ఉండాలని వివిధ పధకాలు ప్రవేశ పెట్టారని,వాటిని సద్వినియోగపరచుకోవాలని కోరారు.ఈ సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుకలను, పంపిణీ చేశారు.అనంతరం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంటిపూడి పద్మావతీ, పాలవలస వీరభద్రం, తాడి మరియ, అగురు పద్మావతి, రేలంగి శ్రీదేవి, కవులూరి వెంకట్రావు, పిడిమి ప్రకాష్‌,విజ్జిన సుధాకర్‌, కంటిపూడి శ్రీనివాస్‌, సిటి ప్లానర్‌ వరప్రసాద్‌, ఈఈ కోటేశ్వరరావు, ఐసిడిఎస్‌ అధికారులు దుర్గా మణి, కుసుమ కుమారి,ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here