అభివృది, సంక్షేమాన్ని తుంగలో తొక్కిన జగన్‌

0
56
రద్దుల ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారు:గోరంట్ల
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3 : సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం శాటిలైట్‌ సిటీ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం ఈరోజు జరిగింది. టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు దారా అన్నవరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం రద్దుల ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎద్దేవా చేశారు. ముద్దులతో పాదయాత్ర పూర్తి చేసుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు రద్దులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. గడిచిన ఎనిమిది నెలలలో రాష్ట్రంలో అభివృది, సంక్షేమం రెండింటిని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తుంగలో తోక్కేశారని ఆరోపించారు. మూడు రాజధానులు అనే అంశంతో రాజధాని రైతులకు చేసిన అన్యాయం తీరనిదని, జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ఏఒక్క కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. గతంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని వీడి పక్క రాష్ట్రలకు పోతున్నాయని, దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితుల్లో  పెట్టుబడిదారులు తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మార్ని వాసుదేవ్‌, వాసిరెడ్డి బాబీ, యమ్‌.ఎస్‌.ఆర్‌ శ్రీను, బండారు సత్తిబాబు, పెంకే కోటేశ్వరరావు, బండారు భూలోకమ్మ, లాజర్‌, బెంజ్‌మెన్‌, ధనలక్మి, లలితాదేవి, అలంకార్‌ శ్రీను, అప్పారావు, సూరిబాబు, పెద్దఎత్తున మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here