అమర యోధుడు పొట్టి శ్రీరాములు

0
332
రాజమహేంద్రవరం, నవంబర్‌ 1 : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎన్నో త్యాగాలు చేసి తన జీవితాన్ని పణంగా పెట్టి తుది శ్వాస వరకు పోరాడిన అమరయోధుడు పొట్టి శ్రీరాములు అని, ఆయనకు తెలుగు ప్రజలు రుణపడి ఉంటారని, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ఈరోజు కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టి.గుప్తా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి రౌతు సూర్యప్రకాశరావు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో దంగేటి వీరబాబు, పోలు కిరణ్‌రెడ్డి, మజ్జి అప్పారావు, కట్టా సూర్యప్రకాశరావు, రామకోటి, ఎన్‌.వి.ఆర్‌.శెట్టి, ఫహీమ్‌, రఫీ, నీలం గణపతి, కుమార్‌, శంకర్‌, రామారావు, తదితరులు పాల్గొన్నారు.