అమిత్‌ షా సభకు భారీగా తరలి రండి 

0
276
రాజమహేంద్రవరం, నవంబర్‌ 15 :   బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా ఈ నెల 26న తాడేపల్లిగూడెం వస్తున్న సందర్భంగా జరిగే బహిరంగసభకు నగరం నుంచి పెద్ద ఎత్తున పార్టీ క్రియాశీలక, సాధారణ సభ్యులు హాజరు కావాలని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కోరారు. ఈరోజు జరిగిన డివిజన్‌ అధ్యక్షుల, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి బూత్‌లో బలమైన కార్యకర్తలను, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతతో బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రతి బూత్‌లో ఉన్న వేయిమంది ఓటర్లకు బూత్‌ కమిటీ మెంబర్లు కలిసి వారి సమస్యలను, స్ధానిక సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారం దిశగా చేసి ఓటర్ల మనస్సు గెలుచుకోవాలని కోరారు. డివిజన్‌లో ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, మట్టాడి చిన్ని, గుల్లిపల్లి యేసు వెంకటరమణ, అడ్డాల ఆదినారాయణ, మారేపూడి సుబ్రహ్మణ్యం, కారుమూరి గవర్రాజు, మల్లిడి శ్రీనివాసరెడ్డి, రౌతు వాసు, కామవరపు వీర్రాజు, కోసూరి శ్రీనివాసరావు, బచ్చు సూరిబాబు, మదన్‌, పిల్లాడి రుద్రయ్య, ఎం.భువన్‌,కుమ్మరపురుగు వెంకటరమణ,  ఎస్‌.వి.రాణి, కె.గీత, కమల, పడగల మూర్తి, గాయత్రి, సామా లక్ష్మీ, ఏలూరి సాయిరాంసింగ్‌, జయశ్రీ, తమ్మాజీ, దుర్గాప్రసాద్‌, దేవుడమ్మ, మరిసే రాంబాబు, శ్రీనివాసనాయుడు, కారుమూరి సురేష్‌, ఎరకా మహేష్‌, సత్యశ్రీ, లలిత తదితరులు పాల్గొన్నారు.