అరవ సత్యవాణికి గన్ని కృష్ణ పరామర్శ 

0
451
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 25 : ఇటీవల అనారోగ్యానికి గురై తిరిగి కోలుకున్న తెలుగుదేశం పార్టీ  సీనియర్‌ కార్యకర్త అరవ సత్యవాణిని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ పరామర్శించారు. బెస్తావీధికి సమీపంలోని ముమ్మిడివారి వీధిలో ఆమె నివాసానికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మరింతగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గన్ని వెంట రెడ్డి మణీశ్వరరావు, మళ్ళ వెంకట్రాజు తదితరులు  ఉన్నారు.