అరిపిరాల కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకం

0
249

తెలుగు వెలుగు వ్యాస మంజూష పరిచయ సభలో అభినందనల వెల్లువ

రాజమహేంద్రవరం, జనవరి 20 : సాహితీవేత్త, నరసాపురం వైఎన్‌ కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు సారధ్యంలో 1985నుంచి నిర్వహించిన తెలుగు వెలుగు కార్యక్రమాలకు సంబంధించిన ప్రసంగాలను ఆడియోలలో భద్రపరిచి వాటికి అక్షర రూపం కల్పిస్తూ వెయ్యి పేజీలతో రూపొందించిన ‘తెలుగు వెలుగు వ్యాస మంజూష’ పుస్తకం కోసం పడిన శ్రమ అమోఘమని, మంచి ప్రయత్నం చేసి భవిష్యత్‌ తరాలకు ఓ మంచి గ్రంథాన్ని అందించారని పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు వెలుగు వ్యాస మంజూష పుస్తక పరిచయ సభ సుహ న్మండలి ఆధ్వర్యాన ఏ.వి. అప్పారావు రోడ్డులోని దాట్ల సుభద్రాయమ్మ కళాంగణంలో నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దాదాపు మూడు గంటలకు పైగా సాగిన ఈ సభకు అధ్యక్షత వహించిన డా. బిసి రాయ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ అరిపిరాల తెలుగు వెలుగు పుస్తకం తీసుకురావడానికి చేసిన కృషి అద్వితీయమన్నారు. మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలక ష్ణ శాస్త్రి నిర్దేశం చేస్తూ మంచి మిత్రుల కలయికే సుహ న్మండలిగా పేర్కొన్నారు. మన ఊరికి చెందిన మిత్రులు డాక్టర్‌ అరిపిరాల నరసాపురం కాలేజీలో పనిచేసేటప్పుడు తెలుగు వెలుగు పేరిట చేసిన సభలు నభూతో నభవిష్యత్‌గా సాగాయని,వాటన్నింటినీ క్రోడీకరించి పుస్తక రూపంలో తీసుకొచ్చి, నర్సాపురంలోనే ఆవిష్కరించారని, అయితే ఈ గడ్డ వ్యక్తిగా మనం కూడా గౌరవించుకోవాలన్న ఉద్దేశ్యంతో పరిచయ సభ పేరిట కార్యక్రమం ఏర్పాటుచేశామని ఆయన వివరించారు. సీనియర్‌ పాత్రికేయులు వి ఎస్‌ ఎస్‌ క ష్ణకుమార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె ఎస్‌ రమేష్‌ గ్రంథ పరిచయం చేస్తూ డాక్టర్‌ అరిపిరాల వారి నేతృత్వంలో ఆనాడు తెలుగు వెలుగు సభల్లో పాల్గొన్నామని,ఇప్పుడు గ్రంథ పరిచయం చేసే అద ష్టం దక్కిందని పేర్కొన్నారు. సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ ఆత్మీయ అతిధిగా హాజరై మాట్లాడుతూ, తెలుగు భాషకు విలువ లేకుండా పోతున్న సమయంలో మాత భాష పట్ల అనురక్తి, అభిమానం కల్పించడానికి ఇలాంటి పుస్తకాలు దోహదపడతాయన్నారు. ప్రజల్లో అవగాహన, ప్రకటనల ప్రభావమో ఏమోగానీ మాత భాషలో చదువుకుంటే ప్రయోజనం లేదనే దుస్థితి నెలకొందన్నారు. నిజానికి మాత భాషలో పరిణతి సాధిస్తేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆయన స్పష్టంచేశారు. డాక్టర్‌ అరిపిరాల తన స్పందన తెలియజేస్తూ నరసాపురం వైఎన్‌ కళాశాలలో కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణరావు ప్రోత్సాహంతో తెలుగు వెలుగు సభలను తిరునాళ్ల మాదిరిగా జరిపించగలగామని, మొదట్లో సీనియర్లు వ్యతిరేకించినా, ఆతర్వాత ఒక్కొక్కరూ అందులో మమేకమై, పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. గౌతమీ లైబ్రరీ అభివ ద్ధిలో భాగంగా నూతన భవనాలకు నిధులు మంజూరు చేయించడంతో పాటు పుస్తకాల డిజిటలైజేషన్‌కి అడిగిందే తడవుగా అన్ని ఏర్పాట్లకు ఎమ్మెల్యే పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నారని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ నరసాపురం లో తెలుగు వెలుగు సభలు జరిపి వాటిని పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ ఈ ఊరికి చెందిన డాక్టర్‌ అరిపిరాల తెలుగు వెలుగు పేరిట నర్సాపురంలో సభలు చేయడం, వాటిని పుస్తక రూపం కల్పించడం అభినందనీయమన్నారు. తెలుగు వెలుగు అంటేనే మనస్సు పులకిస్తుందన్నారు. సాహితీ వేత్త, గాయకుడూ ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు వెలుగు సభల సందర్భంగా నన్నయ్య భారత రచన నాటకంలో పాత్రధారిగా తానూ వున్నానని గుర్తుచేసుకున్నారు. పఠన యోగ్యతగల పుస్తకం తెలుగువెలుగు పుస్తకమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్‌ పివి మురళీకృష్ణ మాట్లాడుతూ తానూ మాట్లాడిన ఆడియో చూసి, అక్షరూపం కల్పించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చిందని, అలాంటిది 85 వ్యాసాలకు అక్షర రూపం కల్పించిన డాక్టర్‌ అరిపిరాల కృషి అద్వితీయమని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను విశ్రాంత అధికారి ఓలేటి రామావతారం మాట్లాడుతూ డాక్టర్‌ అరిపిరాల శైలి అద్వితీయమన్నారు. సిబివీఆర్కే శర్మ మాట్లాడుతూ తెలుగు వెలుగు పుస్తకాన్ని పలు కోణాల్లో చూపగలగడం డాక్టర్‌ అరిపిరాల గొప్పతనమన్నారు. ఆడియో చూసి అక్షర బద్ధం చేసిన తీరు అద్వితీయమన్నారు. రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అరిపిరాల ఈ పుస్తకం తీసుకురావడానికి శ్రమించిన తీరు చెప్పలేనిదన్నారు. మహీధర రామశాస్త్రి మాట్లాడుతూ ఈ పుస్తకంలో ముఖ్యంగా చేమకూర వేంకటకవి మీద రాసిన వ్యాసం అద్భుతమన్నారు. డాక్టర్‌ అరిపిరాలపై చిరువోలు విజయ నరసింహారావు పద్యాలూ సమర్పించారు. జోరా శర్మ, వర్తక ప్రముఖులు అశోక్‌ కుమార్‌ జైన్‌, గ్రంధి రామచంద్రరావు, కార్పొరేటర్‌ కోసూరి చండీప్రియ,మాజీ కార్పొరేటర్‌ గూడూరి రాధిక తదితరులు మాట్లాడారు. డాక్టర్‌ అరిపిరాల దంపతులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి మెమొంటో అందించారు. చిలమర్తి ఫౌండేషన్‌ పక్షాన పెరుమాళ్ళ రఘునాధ్‌,జానకి దంపతులు, అలాగే వీరేశలింగం పురమందిరం అధ్యక్షులు మద్దూరి శివ సుబ్బారావు సత్కరించారు. గౌతమీ గ్రంథాలయాధికారి వెంకట్రావు, వెంపాటి విశ్వనాధం, ఎస్పీ గంగిరెడ్డి, పెమ్మరాజు గోపాలక ష్ణ, ఎవివిఎస్‌ కామరాజు, పివిఎస్‌ క ష్ణారావు, ప్రసాదుల హరినాధ్‌, దినవహి బాపిరాజు, ఫణి నాగేశ్వరరావు, నిమ్మలపూడి వీర్రాజు, లక్కోజు సుబ్బారావు, డాక్టర్‌ పీఎస్‌ రవికుమార్‌, ఎర్రాప్రగడ ప్రసాద్‌, నాళం పద్మశ్రీ, జెవిఎస్‌పూర్ణానందరావు, నల్లగొండ రవిప్రకాష్‌, మైదవోలు హర విజయకుమార్‌ దంపతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here