అర్హులందరికీ పింఛన్లు అందేలా చూడాలి 

0
206
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నగర కోఆర్డినేటర్‌ శివరామసుబ్రహ్మణ్యం
కమిషనర్‌కు వైసిపి వినతిపత్రం అందజేత
ఎవ్వరి పింఛన్లు తొలగించలేదు : కమిషనర్‌
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3 : అర్హులైన లబ్దిదారులు అందరికీ పింఛన్లు అందేలా చూడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర కోఆర్డినేటర్‌ శ్రిఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం కమిషనర్‌ను కోరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వైసిపి నాయకులు స్పందన కార్యక్రమానికి హాజరై కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ను కలిసి పింఛన్లు తొలగింపుపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ పింఛన్లు అందించే కార్యక్రమం చేపట్టిందని, అయితే కొంతమంది అర్హులైన వారికి పింఛన్లు అందకపోవడంతో వారిలో ఆందోళన నెలకొందన్నారు. పింఛన్లు తొలగించారని ప్రతిపక్షపార్టీ పెద్దఎత్తున ప్రచారం చేస్తుందని, దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. వృద్ధులు, వితంతువులకు ఫించన్లు ఎందుకు అందించకుండా ప్రక్కన పెట్టారో సమగ్రంగా విచారణ జరిపించి, అర్హులైన పేదలకు ఫించన్లు అందజేసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. దీనిపై కమిషనర్‌ స్పందిస్తూ ఏ ఒక్కరి ఫించను కూడా ప్రభుత్వం తొలగించలేదన్నారు. విద్యుత్‌ శాఖ, ఇతర శాఖల నుండి వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3500 మంది పింఛన్లు ప్రక్కన పెట్టడం జరిగిందన్నారు. పాత పింఛన్లతో పాటు, కొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేసిన తర్వాత, పెండింగ్‌లో ఉంచిన పింఛన్లపై విచారణ జరిపిస్తామన్నారు. వార్డు కార్యదర్శిలే పింఛన్‌దార్ల ఇంటికి వెళ్ళి పరిశీలన చేస్తారన్నారు. ఏయే కారణాలతో పింఛన్లను పెండింగ్‌లో పెట్టారో పరిశీలన చేస్తారని, వారంతా అర్హులైతే వార్డు కార్యదర్శులు నివేదిక ఇస్తారన్నారు. అర్హుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వం నుంచి పింఛన్ల సొమ్ము మంజూరు అవుతుందని, ఆ తర్వాత వారికి పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఏ ఒక్కరి పింఛన్లను తొలగించలేదని, పింఛన్‌దారులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, వైసిపి మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలరెడ్డి, మాజీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధర్‌, మాజీ కార్పొరేటర్‌లు ప్రసాదుల హరనాధ్‌, బొంత శ్రీహరి, నండూరి రమణ, నీలపాల తమ్మారావు, డాక్టర్‌ అనుసూరి పద్మలత,మానే దొరబాబు, నాయకులు దాసి వెంకట్రావు, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి,  డాక్టర్‌ లంక సత్యనారాయణ, మాసా రామ్‌జోగ్‌, మజ్జి అప్పారావు,  మరుకుర్తి నరేష్‌,  ముప్పన ప్రభాకర్‌, ముప్పన శ్రీనివాస్‌, నిరీక్షణ జేమ్స్‌, దుంగ మంగాలక్ష్మి, ఉప్పాడ కోటరెడ్డి, గుడాల జాన్సన్‌, గుడాల ప్రసాద్‌, గుడాల ఆదిలక్ష్మి, పెంకే సురేష్‌, దూర్వాసుల సత్యనారాయణ,  వలవల చిన్ని, బురిడి త్రిమూర్తులు,అడపా అనిల్‌ కుమార్‌.సోడదాసి సుందర్‌సింగ్‌, కుక్కా తాతబ్బాయి, కురిమెల్లి స్వరూప్‌, ఎండి హసీనా, హాసన్‌, జానా బుజ్జి, వెంట్రపాటి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here