అర్హులని గుర్తిస్తే ఇప్పుడు కాదంటే ఎలా ?

0
172
గతంలో ప్రదర్శించిన జాబితాల పరిస్థితి ఏమిటి – వాలంటీర్ల కారణంగా గందరగోళ పరిస్థితి
స్పందన కార్యక్రమంలో కమిషనర్‌కు తెదేపా నేతల వినతి
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 21 :  నగరంలో ప్రభుత్వ ఇళ్ల మంజూరు విషయంలో చాలా గందరగోళ పరిస్థితి నెలకొందని, హౌసింగ్‌నకు సంబంధించి ఫేజ్‌-1, ఫేజ్‌-2లో అనేక సమస్యలు నెలకొన్నాయని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు మరికొంత గందరగోళం స ష్టిస్తున్నారని, అందువల్ల ఫేజ్‌-1లో గతంలో డీడీలు చెల్లించి పట్టాలు పొందిన లబ్ధిదారులు, ఫేజ్‌-2లో నగరపాలక సంస్థ అధికారులు నగరపాలక సంస్థ ఆవరణలో ప్రదర్శించిన అర్హుల జాబితాలోని వారు నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నందున వీటిపై సమగ్ర సమాచారం ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు  నగర పాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, తెలుగుదేశం పార్టీ  టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరావు,యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), తదితర నాయకులు హాజరై కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫేజ్‌-1కు సంబంధించి అధికారుల సమక్షంలోనే డ్రా తీసిన 4200 మంది లబ్ధిదారులు గతంలో డీడీలు చెల్లించారని, వారందరికీ గతంలోనే ఫ్లాట్‌ నెంబర్లతో సహా పట్టాలు కూడా ఇచ్చారని వివరించారు. అయితే  ప్రస్తుతం వారందరినీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం  నియమించిన వాలంటీర్లు సర్వే నిమిత్తం పిలిచి మీకు ఇంకా ఇల్లు మంజూరు కాలేదు… సర్వే చేస్తున్నాం అంటూ భయాందోళనకు గురి చేస్తున్నారని…. అధికారుల సమక్షంలోనే డ్రా తీసి… ఫ్లాట్‌ నెంబర్లతో సహా పట్టాలు ఇచ్చిన ఫేజ్‌-1లోని  లబ్ధిదారుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి…. వారికి ఇచ్చిన పట్టాలు ఏం చేయాలి…. వాటికి విలువ ఉందా..? లేదా…? వారందరికీ ఇళ్లు మంజూరైనట్టా..? లేదా…? అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు. అలాగే ఫేజ్‌-2కు సంబంధించి అర్హులంటూ 3751 మంది పేర్లను నగర పాలక సంస్థ కార్యాలయంలోని బుద్దిడి విగ్రహం వద్ద జాబితా ప్రదర్శించారని. జాబితా ప్రదర్శించడానికి ముందే ప్రధాన మంత్రి ఆవాజ్‌ యోజనా పథకం కింద సర్వే కూడా నగరపాలక సంస్థే నిర్వహించి ప్రజల సమక్షంలో దరఖాస్తుదారులందరికి నగరపాలక సంస్థ అధికారులు (కమిషనర్‌, అదనపు కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌, మేనేజర్‌, నగర ఉన్నతాధికారులు) సమక్షంలో డ్రా తీసి, హేబిటేషన్‌ ఆఫీసర్‌ను ఇంటింటికి పంపి డ్రా తీయగా వచ్చిన వారంతా నిజమైన అర్హులా కాదా అనే విషయాలపై సర్వే చేయించారని, తరువాత నగరపాలక సంస్థ ఆవరణలో అర్హుల జాబితాను ప్రదర్శించారని పేర్కొన్నారు. ఇక్కడా మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించి వాలంటీర్లు సర్వే అంటూ మళ్లీ వారందరినీ పిలిచి హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో నగరపాలక సంస్థ అధికారులే సర్వే చేసిన ప్రదర్శించిన దానికి విలువ ఉందా…? లేదా..? ఫేజ్‌-2 అంటూ ప్రదర్శించిన జాబితాలోని వారంతా ప్రభుత్వ ఇళ్లు పొందేందుకు అర్హులా..? కాదా..? విషయాన్ని కూడా స్పష్టం చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతి సుందరి, కడలి రామకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్‌, కొమ్మా శ్రీనివాస్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, ఇన్నమూరి రాంబాబు, మొకమాటి సత్యనారాయణ, గగ్గర సత్యనారాయణ, కురగంటి సతీష్‌, పాలవలస వీరభద్రరావు, కోసూరి చండీప్రియ, పెనుగొండ విజయభారతి, రెడ్డి పార్వతి, సింహా నాగమణి, పితాని లక్ష్మీకుమారి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, బెజవాడ రాజ్‌కుమార్‌, శీలం గోవింద్‌, అరిగెల బాబురాజేంద్రప్రసాద్‌, తంగెళ్ల బాబి, మాధవీలత, మజ్జి పద్మ, కోరుమిల్లి విజయశేఖర్‌, శీలం గోవింద్‌,  నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి, పితాని కుటుంబరావు, కొమ్మా రమేష్‌, ఆంటోని, ధన, ఆశపు సత్యనారాయణ, శెట్టి జగదీష్‌, పెనుగొండ రామకృష్ణ, బేసరి చిన్ని, పల్లి సాయి, మజ్జి రాంబాబు, కంటిపూడి శ్రీనివాస్‌, నల్లం ఆనంద్‌, మరుకుర్తి రవియాదవ్‌, రాము, షేక్‌ సుభాన్‌, ఉమా మహేశ్వరరావు, ఈతలపాటి కృష్ణ, ఛాన్‌ భాషా కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here