అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల స్థలాలు :జక్కంపూడి 

0
62
రాజమహేంద్రవరం, జనవరి 25 :నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ పక్కా గృహాలు నిర్మించుకునేందుకు వీలుగా ఇళ్ల స్థలాలను అందిస్తామని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కోరుకొండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, మండలానికి చెందిన అధికారులతో తహాసీల్దార్‌ కార్యాలయంలో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల ప్రజలను దృష్టిలో పెట్టుకుని పక్కా గృహాలను నిర్మించుకునేందుకు వీలుగా ఉగాది నాటికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. దీనిలోభాగంగా ఆయా గ్రామాల్లో అర్హులైన వారిని గుర్తించి వారికి గృహాలకు సంబంధించిన స్థలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకూ సేకరించిన భూముల వివరాలను రెవెన్యు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ముందుగా మండలంలోని నుపూరు, గాదరాడ, నరసాపురం, జంబూపట్నం, పశ్చిమ గాను గూడెం, కోరుకొండ, కాపవరం, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులతో కలిసి అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్నం నుంచి రాఘవపురం, బొల్లెద్దుపాలెం, గరగలం పాలెం, కోటి, దోసకాయలపల్లి, నిడిగట్ల, గాడాల, మధురపూడి, బూరుగుపూడి, గుమ్ములూరు, బుచ్చింపేట గ్రామాలకు చెందిన భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here