అర్హులైన వారికి రుణాలు అందేలా కృషిచేస్తాం

0
243
రాజమహేంద్రవరం, జులై 24 : రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా అర్హులైన దళితులకు రుణాలు అందించి ఆర్థికంగా నిలబడేలా కృషిచేస్తామని ఆ సంస్థ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌ అన్నారు. రూరల్‌ నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయానికి వెళ్ళి సూపరింటెండెంట్‌ సుబ్బారావును కలిసి ఎస్సీ రుణాల యూనిట్లపై చర్చించారు. సుమారు 900 మంది రుణాల కోసం మంజూరు చేయగా 220 మందికి రుణాలు  అందించేందుకు జాబితా సిద్ధం చేయడం జరిగిందని సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో యూనిట్ల సంఖ్యను పెంచి అర్హులైన వారికి రుణాలు అందించేలా కృషిచేస్తానన్నారు. కాశి వెంట జాలా మదన్‌, కాకర్ల ప్రసాద్‌, మారే వెంకటేశ్వరరావు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here