అల్లూరి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

0
387
రాజమహేంద్రవరం, జూలై 4 : స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీషు సామ్రాజ్యవాదులపై మూడేళ్ళ ప్రత్యక్ష సాయుధ పోరాటంచేసి అతి చిన్న వయస్సులోనే వీరమరణం పొందిన ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను అన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని  రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం గౌరవ అధ్యక్షులు డా|| కర్రి రామారెడ్డి అన్నారు. అల్లూరి 121వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక గోదావరి గట్టుపై రాష్ట్ర అల్లూరి  సీతారామరాజు యువజన సంఘం ఏర్పాటుచేసిన అల్లూరి కాంస్య విగ్రహానికి ఆయన పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం దేశంకోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుసుకోవల్సిన అవసరం ఎంత్తైన వుందని, స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీషు వారిపై ప్రత్యక్ష సాయుధ పోరాటంచేసిన విప్లవవీరుల్లో సీతారామరాజు అగ్రగణ్యుడని, ఆయన చరిత్ర ప్రాథóమిక పాఠశాల నుండి ఉన్నత విద్య స్థాయి వరకు పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డా|| రామారెడ్డి కోరారు. ఈ సందర్భంగా యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ అల్లూరి చరిత్రకు రాజమహేంద్రవరానికి విడదీయరాని అనుబంధంవుందని, ఆయన జీవించిన 27 సం||రాల్లో 13 సం||రాలు రాజమహేంద్రవరం గోదావరి గట్టు సమీపంలో నివశించి, సూర్యోదయం, సూర్యస్తమయ సమయాల్లో గోదావరి పుష్కరాలరేవులో స్నానమాచరిచడం జరిగిందని, అంతేకాకుండా ఆయన విద్యాభ్యాసం ఇక్కడే ప్రారంభమై 6వ తరగతి ఉత్తీర్ణులయ్యారని పడాల గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర అల్లూరి  సీతారామరాజు యువజన సంఘం కోశాధికారి బళ్ళా శ్రీనివాస్‌ (మయూరి శ్రీను), ప్రధాన కార్యదర్శి మాదేటి రవిప్రకాష్‌, కార్యదర్శి వెల్లాల నాగార్జున, కార్యవర్గ సభ్యులు దీపక్‌, పడాల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here