అవకాశాలను అందిపుచ్చుకోవాలి…. ఉన్నత స్ధానానికి ఎదగాలి 

0
364
ఆర్ట్సు కళాశాల ప్రాంగణంలో అట్టహాసంగా మెగా జాబ్‌ మేళా
ప్రారంభించిన నారా లోకేష్‌ – భారీగా హాజరైన నిరుద్యోగ యువత
రాజమహేంద్రవరం డిసెంబర్‌ 16 :  ఉత్సాహం, మేధోసంపత్తి కలిగిన యువతకు  ఆంధ్రప్రదేశ్‌లో లోటులేదని, వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకుని ఉన్నత స్ధానానికి ఎదగాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి సారధ్యంలో స్ధానిక ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌ మేళాను లోకేష్‌ నేడు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెగా జాబ్‌మేళాకు రాష్ట్ర వ్యాప్తంగా హాజరయైన యువతను ఉద్ధేశించి లోకేష్‌ మాట్లాడుతూ యువత చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్‌ ఉందన్నారు. మనకు ఇష్టం లేకున్నా రాష్ట్ర విభజన జరిగిందని, ఈ విభజనతో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఏర్పడిందన్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కృషి కారణంగానే సైబరాబాద్‌లో హైటెక్‌ సిటీ ఏర్పడి లక్షలాది మంది యువతకు ఐటి రంగంలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. మైక్రోసాఫ్ట్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. విభజన ఆంధ్రప్రదేశ్‌కు అనేక ఐటి కంపెనీలతో పాటు అనేక పరిశ్రమలను తీసుకువచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని యువతకు అనేక అవకాశాలను కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలన్నారు.  బాబు వస్తే.. జాబ్‌ వస్తుందన్న నినాదాన్ని నిజం చేయడానికి ఇటువంటి జాబ్‌మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. యువత నచ్చిన జాబ్‌ కోసమే ఎదురుచూడకుండా వచ్చిన జాబ్‌లో చేరి తర్వాత తమ లక్ష్యాలను అందుకోవడానికి ప్రయత్నించాలన్నారు.  యువత ఖాళీగా ఉంటే చెడు మార్గాలు పట్టే ప్రమాదం ఉందని, అందుచేత గ్రాడ్యు పూర్తిచేసిన యువత ఎట్టిపరిస్థితుల్లో ఖాళీగా ఉండరాదని, ఏదో ఒక ఉద్యోగంలో చేరాలన్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌, వికాస సంస్ధ ద్వారా అనేక జాబ్‌ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో చిచ్చుపెట్టే వారిని నమ్మొద్దన్నారు. ఎన్‌టిఆర్‌, చంద్రబాబు వంటి ఆదర్శనీయమైన వ్యక్తులు, దేశానికి స్వాతంత్య్ర తీసుకువచ్చిన వారిని ఆదర్శంగా తీసుకుంటారా? అవినీతిపరులను ఆదర్శంగా తీసుకుంటారో యువత తేల్చుకోవాలన్నారు. కష్పపడితేనే భవిష్యత్‌ అని యువత కష్టపడి పనిచేయాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ బాబు వస్తే… జాబు వస్తుందనే నినాదాన్ని నిజం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతకు ఉద్యోగ కల్పనకు ఇటువంటి జాబ్‌మేళాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరంలో రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సారధ్యంలో ఇంత పెద్ద ఎత్తున జాబ్‌మేళా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లా స్ధాయిలో ఏర్పాటుచేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధులు ఈ జాబ్‌మేళాకు హాజరయ్యారని చెప్పారు. ఎవరిదైనా సిఫారస్సు ఉంటేగానీ కంపెనీల ఇంటర్వ్యూలకు వెళ్ళే అవకాశం లేదని అటువంటిది అనేక కంపెనీలను ఇక్కడకు తీసుకురావడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగాల సాధనకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. యువతలోని తెలివితేటలను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో పెద్దఎత్తున జాబ్‌మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌, వికాస సంస్ధతో పాటుగా నన్నయ విశ్వవిద్యాలయం సహకారం అందించాయన్నారు. జాబ్‌ మేళాకు హాజరయ్యేందుకు సుమారు 20వేల మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా, మరో 5నుంచి 8వేల మంది నేరుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి వచ్చారన్నారు. జాబ్‌మేళాలలో 100కు పైగా కంపెనీలు హాజరై 8000 వేలకు పైగా ఉద్యోగాలను అందించనున్నాయన్నారు. ఇంటర్వ్యూలను ఎదుర్కోవడంపై నిరుద్యోగులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. జాబ్‌మేళాలో ఉద్యోగం రాని యువత నిరుత్సాహ పడొద్దని, ఇక్కడ అనుభవంతో తప్పులను సరిదిద్దుకొని తదుపరి జాబ్‌మేళాలలో ఇంటర్వ్యూలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలన్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు యువతనేత నారా లోకేష్‌ ప్రత్యేక దృష్టి పెట్టి కృషిచేస్తున్నారన్నారు. గత రెండేళ్ళుగా ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా నిరుద్యోగ యువతకు స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ హెచ్‌ అరుణకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకోసం వికాస సంస్ధ 2013లో ఆవిర్భవించిందన్నారు. ఈ సంస్ధ ద్వారా గత రెండేళ్ళగా జాబ్‌మేళాలు నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. వికాస సంస్ధ పిడి ఎంఎన్‌ రావు మాట్లాడుతూ ఈ రెండేళ్ళలో వికాస ద్వారా 25వేల ఉద్యోగాలను కల్పించామన్నారు. 2019 నాటికి లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సిటీ శాసనసభ్యులు డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ఒక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా ఎలా నిర్వహించాలో గోరంట్ల చేసి చూపించారని ప్రశంసించారు. నగర మేయర్‌ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని దాన్ని బయటకు తేవాలన్నారు. మూడు రోజుల పాటు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారిలో ఒక భరోసా, ధైర్యాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ  కార్యక్రమంలో నన్నయ విసి ముర్రు ముత్యాల నాయుడు, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌లు ప్రసంగించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శంకరరావు, రివర్‌బే ఎండి జాస్తి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, గైట్‌ ఎండి చైతన్యరాజు, జిఎస్‌ఎల్‌ ఛైర్మన్‌ గన్ని భాస్కరరావు, ఎస్‌వి జనరల్‌ మార్కెట్‌ కమిటీ, ఎస్‌బి మోటార్స్‌, జాంపేట బ్యాంక్‌ ఛైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌, టింబర్‌ మర్చంట్స్‌, ఛాంబర్‌ ట్రస్ట్‌, ఆనం ఎలక్ట్రికల్స్‌, ట్రిప్స్‌ స్కూల్‌, గోల్డ్‌స్పాట్‌, కీర్తి శ్రీనివాస్‌, చింతపల్లి శ్రీనివాస్‌, న్యాయవాదుల అసోసియేషన్‌, రాకీ వెంచర్స్‌, ఇంటర్నేషనల్‌ పేపర్‌మిల్లు, కంటిపూడి సర్వారాయుడు, జిఎంఆర్‌, ఆటోమొబైల్స్‌ అసోసియేషన్‌లు సహకారం అందించారని గోరంట్ల ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో జెడ్‌పి ఛైర్మన్‌ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, రవి వర్మ, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, నిమ్మల రామానాయుడు, కెఎస్‌ జవహర్‌, తోట త్రిమూర్తులు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శంకరరావు, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, బండారు సత్యానందరావు, పార్టీ నాయకులు పెచ్చేటి చంద్రమౌళి, వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, కాశి నవీన్‌కుమార్‌, కురగంటి సతీష్‌, మజ్జి రాంబాబు, పాలిక శ్రీను, యార్లగడ్డ శేఖర్‌, అరిగెల బాబూ రాజేంద్రప్రసాద్‌, యార్లగడ్డ అశోక్‌కుమార్‌, మళ్ళ వెంకట్రాజు, ఉప్పులూరి జానకీ రామయ్య, బెజవాడ వెంకటస్వామి, గరగ మురళీకృష్ణ, తంటేటి సాయి, వెలమ దుర్గాప్రసాద్‌, తురకల నిర్మల, యిన్నమూరి దీపు, సూరంపూడి శ్రీహరి, పోలాకి పరమేష్‌, యెనుముల రంగబాబు, పిల్లి శ్యామ్‌కుమార్‌, రొబ్బి విజయశేఖర్‌, వెలమ పద్మ, మరుకుర్తి చంద్రశేఖర్‌యాదవ్‌, మార్గాని సత్యనారాయణ, తలారి భగవాన్‌, మార్ని వాసుదేవ్‌, అడ్డగర్ల ఆనంద్‌, కరుటూరి అభిషేక్‌, కర్రి రాంబాబు, తీడ నరసింహమూర్తి, బర్ల గిరిజ, బుడ్డిగ రవి, దమరసింగ్‌ బ్రహ్మాజి, రాయి అప్పన్న, విశ్వనాధరాజు, మాకాని లక్ష్మణరావు, గాడి శ్రీను, సింహ శివ, కార్పొరేటర్‌లు కడలి రామకృష్ణ, కోరుమిల్లి విజయశేఖర్‌, కోసూరి చండీప్రియ, గగ్గర సూర్యనారాయణ, కిలపర్తి శ్రీనివాస్‌, మానుపాటి తాతారావు, గొందేశి మాధవీలత, కొమ్మ శ్రీనివాస్‌, యిన్నమూరి రాంబాబు, బెజవాడ రాజ్‌కుమార్‌, కురగంటి ఈశ్వరి, పల్లి శ్రీనివాస్‌, బూర దుర్గాంజనేయురావు, ద్వారా పార్వతి సుందరి, రెడ్డి పార్వతి, కరగాని మాధవి, పెనుగొండ విజయభారతి, సింహా నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్‌,  మళ్ళ నాగలక్ష్మి, కంటిపూడి పద్మావతి, పాలవలస వీరభద్రం, గరగ పార్వతి, కోఆప్సన్‌ సభ్యులు మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారిలు పాల్గొన్నారు.