అవగాహనా రాహిత్యంతో షర్మిళారెడ్డి వ్యాఖ్యలు

0
233
నగర తెదేపా ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 10 : జగన్‌ ప్రభుత్వ పనితీరుపై దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలన్న షర్మిలారెడ్డి వ్యాఖ్యలు అవగాహనతాహిత్యంగా ఉన్నాయని, ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన ఆమెకు తెలుగుదేశం పార్టీ గురించి ఏమి తెలుసని నగర తెదేపా నగర  ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి అన్నారు. షర్మిలారెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వంద రోజుల పాలనలో జగన్‌ అన్ని రంగాల్లో విఫలమయ్యారని, ఆయనకు ఓటు వేసిన ప్రజలే తప్పు చేశామని సోషల్‌ మీడియాలోనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న విషయాలు వారికి కనిపించడం లేదా అని విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడే ముందు తమ పార్టీ నాయకులు దమ్ము,ధైర్యం కోసం వారి పార్టీలోని సీనియర్లను అడిగి తెలుసుకుంటే బాగుంటుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె డివిజన్‌లో వారి పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో, వారి సత్తా ఏంటో అందరికి తెలిసిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పాలసీపై మాట్లాడుతుందని, వ్యక్తిగతంగా విమర్శల జోలికి వెళ్ళదన్నారు.వందరోజుల్లో పేదల ఆకలి కేకలు, వివిధ రంగాల కార్మికుల ఇబ్బందులు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు.ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రెడ్డి మణి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here