అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధం

0
275

కేంద్ర చట్టంపై ఇండియన్‌్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హెచ్చరిక

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 5 : కేంద్రప్రభుత్వం రూపొందించిన సెంట్రల్‌ క్లినికల్‌ అస్సెస్‌మెంట్‌ యాక్డు 2010ని అమల్లోకి తీసుకురావద్దని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) నగర శాఖ డిమాండ్‌ చేసింది. బుధవారం అసెంబ్లీలో ఎటువంటి చర్చ జరగకుండానే హడావిడిగా ఆమోదించిన సెంట్రల్‌ క్లినికల్‌ అస్సెస్‌మెంట్‌ యాక్టు 2010ని నిరసిస్తూ నేడు నగరంలోని వైద్యులు తమ వైద్యశాలల్లో సేవలను నిలుపుదల చేసారు. ఐఎంఎ హాల్‌లో సమావేశమై బిల్లుపై తమ తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. అనంతరం స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి, జిఎస్‌ఎల్‌ కళాశాల అధినేత డాక్టర్‌ గన్ని భాస్కరరావు, ఐఎంఎ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ వైఎస్‌ గురుప్రసాద్‌, డాక్టర్‌ జి వీరభద్రస్వామిలు మాట్లాడారు. రాష్ట్రంలో నర్సింగ్‌ ¬ంలు, క్లినిక్‌లను నియంత్రణలో పెట్టేందుకు రాష్ట్ర స్ధాయిలో చట్టం ఉందన్నారు. ఈ చట్టంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్ది పటిష్టవంతంగా అమలుచేయవచ్చన్నారు. అయితే కొన్ని రాష్ట్రాలలో అటువంటి చట్టాలేవీ లేని కారణంగా కేంద్రప్రభుత్వం సెంట్రల్‌ క్లినికల్‌ అస్సెస్‌మెంట్‌ యాక్టు 2010ని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేస్తే చేయవచ్చని, లేకుంటే ఆయా రాష్ట్రాలలో అమలుజరుగుతున్న చట్టాలనే అమలు చేసుకోవచ్చన్న వెసులుబాటు కూడా ఉందన్నారు. వైద్యశాఖామంత్రి లేని సమయంలో అధికారులు ఈ బిల్లును ప్రవేశపెటితే కనీసం చర్చకూడా జరగకుండా ఆమోదించడం దారుణమన్నారు. ఈ చట్టం చూడటానికి పైకి బాగానే కన్పిస్తున్నప్పటికీ అమలుచేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. క్లినిక్‌కి అత్యవసర కేసులు వస్తే వాటిని వెనక్కి పంకుండా రోగి స్టెబిలైజ్‌ అయ్యే విధంగా వైద్యం చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం పంపించాలన్న నిబంధన వల్ల రోగికి నష్టమే జరుగుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. సెంట్రల్‌ క్లినికల్‌ అస్సెస్‌మెంట్‌ యాక్టు 2010ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అవసమైతే కర్నాటక వైద్యుల తరహాలో నిరవదిక సమ్మె చేయడానికి వెనకాడమన్నారు. గతంలో తీసుకువచ్చిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌పై పోరాడి అందులో ఇబ్బందికరంగా ఉన్న ఎగ్జిట్‌ పరీక్షల నిర్వహణ, బ్రిడ్జికోర్సు వంటి అంశాలు వెనక్కి తీసుకొనే విధంగా విజయం సాధించామన్నారు. డాక్టర్‌ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంపై పోరాడుతన్నామంటూనే, కేంద్రం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధపడటం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో వేలూరి రామచంద్ర, కె విజయకుమార్‌, తిర్నాతి రమేష్‌బాబు తదితర వైద్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here