అవినీతిరహిత పాలన అందిస్తా

0
392
స్టేషన్‌కు వచ్చే బాధితులకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు
రౌడీయిజాన్ని అణచివేస్తాం : ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన షెముషి
రాజమహేంద్రవరం, జులై 23 : అవినీతి రహిత పాలనను అందించి న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులకు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించే విధంగా పరిపాలన జరుగుతుందని అర్బన్‌ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ షెముషి బాజ్‌పాయ్‌ తెలిపారు. ఈరోజు ఉదయం అర్బన్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బి.రాజకుమారి నుంచి షెముషి బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు రాజకుమారి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ షెముషి మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు దొంగతనాలు జరగకుండా ముందుగానే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై జరిగే వేధింపులను అరికట్టి అర్బన్‌ జిల్లా పరిధిలో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. తన పరిధిలో రౌడీయిజాన్ని పూర్తిగా అణచివేస్తామని, నిజాయితీగా వ్యవహరించి సమీకృతంగా పరిపాలన అందిస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినా, సమస్యలు ఎదురైనా వాట్సాప్‌కు ఫిర్యాదు చేయవచ్చని లేనిపక్షంలో తన మొబైల్‌ నెంబర్‌కు నేరుగా ఫోన్‌ చేసి సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ప్రజల కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని, ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ షెముషిని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు, బుడ్డిగ రాధ మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అడిషనల్‌ ఎస్పీ రజనీకాంత్‌రెడ్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ సమావేశమై సిబ్బందిని పరిచయం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here