అవినీతి వ్యతిరేక కమిషన్‌ సంస్ధ వైస్‌ చైర్మన్‌గా మూర్తి 

0
334
రాజమహేంద్రవరం, నవంబర్‌ 25 :  అఖిల భారత అవినీతి వ్యతిరేక కమిషన్‌ సంస్ధ  రాష్ట్ర వైస్‌ చైర్మన్‌గా ఎం.ఎస్‌.ఎన్‌.మూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ నల్లధనం నిర్మూలనకు  ప్రధాని చేస్తున్న ప్రయత్నానికి తమ సంస్ధ నుంచి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. రూపాయి విలువ పెంచే ప్రయత్నంలో  ప్రధానికి ప్రజల మద్ధతు ఉంటుందన్నారు. అవినీతి నిర్మూలనపై  ప్రజలను చైతన్యపర్చడానికి తమ సంస్ధ ప్రచారం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్‌ వైస్‌ చైర్మన్‌ పి.వాసు, కమల్‌ పాల్గొన్నారు.