అవినీతి వ్యవహారాలకే పట్టిసీమ ప్రాజక్ట్‌ 

0
310
 మాజీ ఎంపి హర్షకుమార్‌ ఆరోపణ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : పట్టిసీమ పెద్ద బోగస్‌ ప్రాజక్ట్‌ అని, ప్రభుత్వంలోని పెద్దలకు, ఎమ్మెల్యేలను కొనడానికే పట్టిసీమ ప్రాజక్ట్‌ తలపెట్టారని అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగం కాదని ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పట్టిసీమకు అసలు అనుమతే లేదని, అనుమతి గురించి తమను సంప్రదించేలేదని తెలియజేసిందని  హర్షకుమార్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నదుల అనుసంధానం అంటే స్టోరేజి చేసుకోవడానికి డ్యామ్‌ కాని, రిజర్వాయర్‌ కాని కావాలని లేదంటే ఫీజ్‌బుల్‌ కాదని తెలిపిందని ఆయన పేర్కొన్నారు. అనుసంధానం వంద సంవత్సరాల నుంచి జరుగుతోందని, ఇది కొత్త కాదని ఎక్కడక్కడ అనుసంధానం జరుగుతోందో తెలిపిందన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పాలసీని అనుసరించే డిపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజక్ట్‌ రిపోర్ట్‌) తయారవుతుందని, అసలు పట్టిసీమ డిపీఆర్‌ కూడా కేంద్రానికి పంపలేదని తెలియజేశారని హర్షకుమార్‌ పేర్కొన్నారు. కాబట్టి పట్టిసీమ పెద్ద బోగస్‌ ప్రాజక్ట్‌ అని తేలిపోయిందన్నారు.