ఆంధ్రుల అందాలనటుడు శోభన్‌బాబు

0
110
ఘనంగా 84వ జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం, జనవరి 14 : ఆంధ్రుల అందాలనటుడిగా నటభూషణ్‌ శోభన్‌బాబు ఎప్పటికీ ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి రాజమహేంద్రవరం గౌరవ అధ్యక్షుడు అల్లు బాబీ అన్నారు. విశిష్ట వ్యక్తిత్వంతో అందరి మంచికోరే నటుడు శోభన్‌బాబు అని ఘనంగా నివాళులర్పించారు.  విలక్షణ నటుడు, అద్బుతమైన నటనా కౌశలం, అశేష సంఖ్యలో మహిళాభిమానం పొందిన సొగ్గాడు నటభూషణ శోభన్‌ బాబు 84వ జయంతోత్సవం గోదావరి గట్టున శోభన్‌ బాబు విగ్రహం వద్ద శోభన్‌ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో అభిమానులు అత్యంత వైభవంగా నిర్వహించారు.  గౌరవ అధ్యక్షులు అల్లు బాబి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ అభిమానులను సన్మార్గంలో నిలిపిన మార్గ దర్శకుడు శోభన్‌బాబు అని, తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల హ దయాలలో ఉండే నటుడన్నారు. అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతీ ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సినిమా, నిజజీవితానికి న్యాయం చేసిన ఏకైక నటుడు శోభన్‌బాబు అని కొనియాడారు. ముందుగా శోభన్‌ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  పులిహోర,స్వీట్స్‌,మజ్జిగ వితరణ చేసారు.ఈ కార్యక్రమంలో శోభన్‌ బాబు సేవా సమితి అధ్యక్షుడు కోనగళ్ల శ్రీనివాస్‌ కుమార్‌, కార్యదర్శి పూడి శ్రీనివాస్‌, గౌరవ కన్వీనర్‌ బళ్ళా శ్రీనివాసరావు, బట్టిప్రోలు శ్రీనివాస్‌(భీమవరం),డీవీవి రాజు(కాకినాడ),ఏవీఎస్డీ ప్రసాద్‌, నరుకుల విశ్వనాధం,ఏ.అన్నవరం, వీవీ వెంకటరమణ, కొత్తపల్లి చంటిబాబు,కె ఆనంద్‌,కేఎస్‌ ప్రకాష్‌,జి అప్పారావు, జివీ క ష్ణారెడ్డి,వీవీ శంకర్‌, కంతేటి సాయి, ఆర్వీబిఎస్‌ శర్మ, కేఎస్‌ఎన్‌ రాంబాబు, చాముండేశ్వరావు,టీవీ రమణ, కాకినాడ ప్రసాద్‌, సింహాచలం, ప్రకాష్‌,అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here