ఆకట్టుకున్న నర్తనకేళి

0
302
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 27 : సద్గురు సన్నిధి నెలవారీ సంగీత, నృత్య ప్రదర్శనలో భాగంగా ఇటీవల శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్‌ శిష్యుల ఆలయ నృత్యం వైష్ణవాగమ రీతిలో నర్తనకేళి జరిగింది. తొలుత సకల దేవాతారాధన, పుష్పాంజలి సమర్పణ ఓంకార శబ్ధ లయాన్విత నత్తానికి ఆలయ నృత్య భంగిమల కూర్పుగా ప్రాచీన వైభవాన్ని కన్నుల ముందు ఉంచింది.  అనంతరం 72 అక్షరాల ఆదినాయక సో ్తత్రం నర్తనాన్ని సంజన, లాస్య, అఫీరా, నాగహరిణి అందంగా నర్తించారు.పృధ్వీ, ఆఫిత్‌, తేజో  వాయుదాకాశ దేవతలను ఆవాహన గావించే ప్రాచీన ఆలయ నర్తనం, పంచభూత నర్తనను  సప్తతాండ ప్రతిరూపాలుగా లాస్య,శిరీష, సుమశ్రీజ, నాగహరిణి, అంకిత, అశ్రిత, నళినిలతల అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి మృదంగంపై యశోదకృష్ణ, వాయులీనంపై పి.గణపతి, స్త్రీ గాత్రంలో వి. ప్రసాద్‌, రూప శిల్పులుగా ఆశపు రామలక్ష్మీ దంపతులు సహకారం అందించారు. ఇటీవల కళారత్న అందుకున్న తొలి రాజమహేంద్రపుర వాసి సప్పా దుర్గాప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు.