ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు

0
113
22, 24, 25 డివిజన్లలో ఉత్సాహంగా నిర్వహాణ
రాజమహేంద్రవరం, జనవరి 13 : నగరంలోని 22, 24, 25 డివిజన్లలో మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, బెజవాడ రాజ్‌కుమార్‌, కురగంటి సతీష్‌ల ఆధ్వర్యంలో వేర్వేరుగా సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు. 22వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ మాటూరి రంగారావు ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో మేకా వెంకట రాజేశ్వరి ప్రథమ బహుమతిని, సరస్వతి ద్వితీయ బహుమతిని, తృతీయ బహుమతిని సజ్జల సురేఖ, నాలుగో బహుమతిని కె.సంతోషి గెలుపొందారు. ఈ సందర్భంగా 20 మందికి కన్సోలేషన్‌ బహుమతులను అందించారు. అలాగే 24వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ బెజవాడ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగాయి. అలాగే 25వ డివిజన్లో మాజీ కార్పొరేటర్లు కురగంటి సతీష్‌, కురగంటి ఈశ్వరి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల్లో ధరరాసి రాధ ప్రథమ బహుమతిని, అప్పన సావిత్రి ద్వితీయ బహుమతిని, తృతీయ బహుమతిని గుమ్మడి తేజ మౌనిక, నాలుగో బహుమతిని దేవశెట్టి మానస గెలుపొందారు. ఈ కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ ఛైర్మన్‌ గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ యువనేత ఆదిరెడ్డి వాసు, బీసీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పాలిక శ్రీను, టిడిని నగర అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి రాంబాబు, రెడ్డి మణి పాల్గొని విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు మజ్జి పద్మావతి, కప్పల వెలుగుకుమారి, గరగ పార్వతి, టిడిపి నాయకులు కొయ్యాన కుమారి, తవ్వా రాజా, మళ్ళ వెంకటరాజు, పల్లి సాయి, గరగ మురళీకృష్ణ, జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here