ఆక్సో ఉత్పత్తులకు ఆంధ్రాలో మంచి గిరాకీ 

0
192
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 30 : గార్మెంట్స్‌ రంగంలో ఇటు దేశీయంగా, అటు విదేశీ ఎగుమతుల్లో దూసుకెళ్తున్న ఆక్సో సంస్థ తన డీలర్స్‌తో  ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించింది. ఆక్సో ఎలినా లెగ్గింగ్‌, కిడ్స్‌, ఔటర్‌ గార్మెంట్స్‌ ఆథరైజ్డ్‌ డీలర్‌ గ్రంధి రంగారావు కోరిక మేరకు మోరంపూడి రోడ్డులోని శుభమస్తు ఫంక్షన్‌ హాలులో  ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఆక్సో ఛైర్మన్‌ ఎం గణేశన్‌ హాజరయ్యారు. మహిళా ఛైర్మన్‌ రుక్మిణి గణేశన్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఛైర్మన్‌ గణేశన్‌ మాట్లాడుతూ ఆక్సో ఉత్పత్తులకు మొదట్లో ఆంధ్ర మంచి మార్కెట్‌గా నిలిచిందని, ప్రస్తుతం విదేశాలకు కూడా ఎగుమతులు చేసున్నప్పటికీ ఆంధ్రా మార్కెట్‌పై తమకు అభిమానం చెక్కుచెదరదని చెప్పారు. సకాలంలో సరుకు సరఫరా చేస్తామని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని చెప్పారు.  జాంపేట బ్యాంకు ఛైర్మన్‌ బొమ్మన రాజకుమార్‌ ముఖ్య అతిధిగా పాల్గొంటూ, కష్టమర్లకు ఆఫర్స్‌,  డీలర్స్‌కి ఆఫర్స్‌ ఇవ్వడం అభినందనీయమన్నారు. గతంలో కూడా కూపన్స్‌ విధానం అమలు చేసినపుడు మంచి స్పందన లభించిందని, తనకు కూడా లక్కీ డ్రాలో కారు తగిలిందని గుర్తుచేసుకున్నారు.  గ్రంధి రంగారావు డిస్ట్రిబ్యూటర్‌ షిప్‌ లో ఆక్సో ఉత్పత్తులకు మంచి పేరు వస్తుందన్నారు.  ప్రత్యేక ఆహ్వానితులు ఎన్‌.వి.ఆర్‌. గుప్తా మాట్లాడుతూ వ్యాపారంలో సుదీర్ఘ అనుభవం గల  గ్రంధి రంగారావుకి డిస్ట్రిబ్యూటర్‌గా నియమించడం  వలన ఆక్సో బ్రాండ్‌ కి మరింత ఇమేజ్‌ వస్తుందన్నారు. కస్టమర్స్‌ కి ఆఫర్స్‌, డీలర్స్‌ బహుమతులు ఇన్సెంటివ్స్‌ ఇవ్వాలని సూచించారు. మార్కెటింగ్‌ మేనేజర్‌ ఎన్‌.  వెంకటేశన్‌ మాట్లాడుతూ గ్రంధి రంగారావు మూడు నెలల క్రితం కల్సి ఇలా డీలర్స్‌ మీట్‌ పెట్టమన్నారని, ఇన్నర్‌ అవుటర్‌ గార్మెంట్స్‌ రెండూ ఇస్తే మార్కెట్‌ లో బాగుంటుందని సూచించారని పేర్కొన్నారు. జయలక్ష్మి ట్రేడర్స్‌ ఎన్‌.ఆర్‌. మురుగేషన్‌, ద్వారపూడి వస్త్ర మార్కెట్‌ అధ్యక్షుడు పంతంగి బోస్‌, వరలక్ష్మి కట్‌ పీసెస్‌ కె ఏడుకొండలు, జి అమర్‌ కుమార్‌,సిహెచ్‌ వి సుబ్బారావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here