ఆటపాటలతో ఆనంద ఆదివారం

0
239
పుష్కరఘాట్‌ వద్ద చిన్నారుల సందడి
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 28 : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కరఘాట్‌ వద్ద నిర్వహించిన హ్యాపిసండే ఆటపాటలతో సరదాగా, సందడిగా సాగింది. తెలుగు, మలయాళి, తమిళం పాటలకు వివిధ డ్యాన్స్‌ అకాడమీల విద్యార్ధులు నృత్యాలను ప్రదర్శించారు. ఓంకార్‌ నృత్య నికేతన్‌కు చెందిన జె. నిషిత దీప్తి స్వచ్ఛ భారత్‌ ఆవశ్యకతను నృత్య రూపకంలో వివరించి కూచిపూడిని ప్రదర్శించారు. మరో విద్యార్ధిని జె. పుష్పిత ఓ సినీ గీతానికి  నృత్యాన్ని ప్రదర్శించారు. హక్కుంపేటకు చెందిన మహత్మా స్కూల్‌ విద్యార్ధులు రెండు సినీ గీతాలకు, సప్పా వారి వీధి నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాల, ధాన్యం పాకలు నగర పాలక సంస్థ, కోటిలింగాలపేట నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాల, మధు డ్యాన్స్‌ అకాడమీ, లయన్‌ కింగ్స్‌ గ్రూప్‌ సభ్యులు వివిధ పాటలకు నృత్యాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ డ్యాన్స్‌ అకాడమీ శేఖర్‌ డ్యాన్స్‌ గ్రూప్‌ విద్యార్ధులు వినూత్నరీతిలో పాటలకు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, గొర్రెల సురేష్‌,మర్రి దుర్గా శ్రీనివాస్‌, స్కూల్స్‌ సూపర్వైజర్‌ దుర్గాప్రసాద్‌, తెదేపా నాయకులు నల్లం ఆనంద్‌ పాల్గొనగా ఉపాధ్యాయురాలు రమాదేవి వ్యాఖ్యతగా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here